"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:రచ్చబండ/పాత చర్చ 19

From tewiki
Jump to navigation Jump to search

పాత చర్చ 18 | పాత చర్చ 19 | పాత చర్చ 20

Contents

వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రతిపాదన

వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రతిపాదన స్థాయిలో వుంది. సభ్యులు ఏకాభిప్రాయానికై సవరణలు చర్చాపేజీలో రాయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 17:21, 27 ఫిబ్రవరి 2013 (UTC)

 • ప్రతిపాదనపై స్పందనకు గడువు ఇంకా మూడురోజులేవుంది. --అర్జున (చర్చ) 14:13, 3 మార్చి 2013 (UTC)
 • ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన సభ్యులు గడువులోగాఅనగా 21మార్చి 2013 23:59 UTCలోగా ఓటువేయండి. --అర్జున (చర్చ) 04:24, 7 మార్చి 2013 (UTC)
 • ఓటు ప్రక్రియ ముగిసింది. ఫలితంపై అభ్యంతరాలుంటే చర్చాపేజీలో 25మార్చి 2013 లోగా చర్చించండి.--అర్జున (చర్చ) 10:21, 22 మార్చి 2013 (UTC)
 • ప్రక్రియ ముగిసింది. ప్రతిపాదన ఆమోదించబడింది. --అర్జున (చర్చ) 13:12, 1 ఏప్రిల్ 2013 (UTC)

పాఠకుల మొదటి పేజీలానే, వ్రాసేవాళ్ళకో మొదటి పుట కావాలి

మొదటి పుటను పూర్తిగా వికీ పాఠకుల కోసం ఆప్టిమైజ్ చేశాం కదా. కానీ వికీలో వ్రాసేవాళ్ళకోసం ఒక ప్రధాన పుట కావాలి. ఆలోచించగలరు. Chavakiran (చర్చ) 02:40, 1 మార్చి 2013 (UTC)

విషయం అర్థం కాలేదు.మరింత విపులంగా చెప్పగలరాపాలగిరి (చర్చ) 02:51, 1 మార్చి 2013 (UTC)

వికీపీడియా:సముదాయ_పందిరి ఉంది కదా?? --వైజాసత్య (చర్చ) 04:41, 1 మార్చి 2013 (UTC)
అనును. నేనుకునే దానికి అది సరిగ్గా సరిపోతుంది. మిస్సయ్యాను. Chavakiran (చర్చ) 07:52, 1 మార్చి 2013 (UTC)

Wikidata phase 1 (language links) live on this Wikipedia

Wikidata-logo-en.svg

Sorry for writing in English. I hope someone can translate this locally. If you understand German better than English you can have a look at the announcement on de:Wikipedia:Kurier.

As I annonced 2 weeks ago, Wikidata phase 1 (language links) has been deployed here today. Language links in the sidebar are coming from Wikidata in addition to the ones in the wiki text. To edit them, scroll to the bottom of the language links, and click edit. You no longer need to maintain these links by hand in the wiki text of the article.

Where can I find more information and ask questions? Editors on en:wp have created a great page with all the necessary information for editors and there is also an FAQ for this deployment. It'd be great if you could bring this to this wiki if that has not already happened. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages.

--Lydia Pintscher 23:11, 6 మార్చి 2013 (UTC)

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

మొలక వ్యాసాల విస్తరణ గూర్చి

క్రొత్త మొలక వ్యాసాలు, ఏక వ్యాసాలు సృష్టించే కన్నా గతంలో గల మొలక, ఏకవాక్య వ్యాసాలను మనమందరం సమిష్టిగా వృద్ధి చేస్తే తెవికీ అందరికీ ప్రయోజన కరంగా ఉంటుందని నా అభిప్రాయం. మొలక వ్యాసాలను దాని వర్గంలో గుర్తించవచ్చు. గాని మొలక మూస లేనిఏక వాక్య వ్యాసాలను ఎవరైనా గుర్తించి ఒక పేజీలో ఉంచినట్లయితె వాటిని తెవికీ సభ్యులు నాణ్యత పెంచుటకు కృషి చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు రోజుకు ఒక వ్యాసం అభివృద్ధి చేస్తే చాలు. తెవికీ నాణ్యత పెరుగుతుంది. ఆ వ్యాసాలు తొలగించేకన్నా వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయడం అవసరమని నా భావన. వాటి చర్చకే అధిక సమయం మనం వెచ్చించామనే విషయం మరువరానిది. చంద్రకాతరావు గారి లాంటి వాళ్ళు గ్రామ వ్యాసాలు విస్తరణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మా లాంటి వాళ్ళం ఏవైనా వ్యాసాలు అభివృద్ధి చేయగలమని నా అభిప్రాయం.

మొలకలు గల తెవికీలో
మొలకల విస్తరణ పనులు మొదలెడదామా,
మొలకలు మన మొదిలేసీ
మొలకలు తొలగించమనుట మేలవు తుందా!

—కె.వి.ఆర్

మొలకనైన నేమి మంచి విషయమైన
విస్తరించి దాని విలువ పెంచు
విషయలేమిదైన వివరింపు వ్యాసము
ఎవరికేమి ఫలము! తెవికి ధీర!

—కె.వి.ఆర్

విషయం సమగ్రంగా లేని విస్తరణ వ్యాసం కంటె మంచి విషయం గల మొలక వ్యాసాన్ని విస్తరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా అభిప్రాయం.(  కె. వి. రమణ. చర్చ 13:00, 8 మార్చి 2013 (UTC))
మంచి సూచన. నేను ఇదివరకు బాటును ఉపయోగించి గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు మినహాయించి మిగిలిన మొలకల జాబితా ఒకటి తయారుచేశాను. అది చివరిసారిగా 2010లో తాజాకరించబడింది. వికీపీడియా:మొలకల జాబితా - ఇక్కడ నుండి మనం విస్తరణ మొదలుపెట్టవచ్చు --వైజాసత్య (చర్చ) 05:40, 26 మార్చి 2013 (UTC)
నేను చాలా రోజుల నుండి కొత్త వ్యాసాలు సృష్టించడం కన్నా మొలక వ్యాసాల విస్తరణ పై దృష్టి పెట్టి విస్తరిస్తున్నాను. - -  కె.వెంకటరమణ చర్చ 05:50, 26 మార్చి 2013 (UTC)

పని చేయని లింకులు

తెవికీ సహాయ పేజీలోని పద్మ - వెన్నా నాగార్జున లింకు పనిచేయడం లేదు. యాహూ జియోసిటీస్ మూసివేయడం వలన ఈ లింకు కూడా తెగిపోయింది. సరిచేయ మనవి.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:07, 10 మార్చి 2013 (UTC)

ఆయన ఎం.ఐ.టీలో చదువుతున్నప్పుడు విశ్వవిద్యాలయపు వెబ్‌సైటులో పద్మను ఉంచేవారు. ఇంకా అక్కడ ఉందో లేదో తెలియదు. అయినా ఈ పద్మ వెబ్‌ పరికరాన్ని నాగార్జున గారు ఇంకా సర్వీసు చేస్తున్నారని నేననుకోను. అయినా ఒకసారి వెతికిచూస్తా --వైజాసత్య (చర్చ) 05:15, 11 మార్చి 2013 (UTC)

బొమ్మల గురించిన సందేహం

వికీ పీడియా లో దస్తాల ఎక్కింపు గురించి ఈ క్రింది సందేహాలను నివృత్తి చేయగలరు.

 1. సినిమా వాల్‍పోస్టర్లను ఫొటో తీసినపుడు అది ఏ లైసెన్సు కిందికి వస్తుంది. ఈ దస్త్రం మరియు ఏదేని వెబ్సైటు నుంచి తీసుకున్న సినిమా ప్రచార చిత్రం ఒకే ప్రాధాన్యత కిందికి వస్తాయా? I mean will both of these fall in same category? ఇలాంటి చిత్రాలను (కెమెరా తో ఫోటో తీసిన వాల్‍పోస్టర్లు) వికీ కామన్స్ లో ఏ లైసెన్స్ తో ఎక్కించవచ్చు?
 2. కెమెరా తో ఫోటో తీసిన వాల్‍పోస్టర్లు మరియు ఇతర వెబ్సైటు నుంచి ఎక్కించిన బొమ్మలు రెండూ లభిస్తున్నపుడు, మొదటి చిత్రానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చునా? I mean, can we use the former image in the corresponding movie article?

సభ్యులు దయచేసి వివరణ ఇవ్వగలరు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:17, 10 మార్చి 2013 (UTC)

కెమెరాతో ఫోటోతీసి వాడుకున్నా, ఆ అసలు పోస్టరు కున్న కాపీహక్కులు పోవు. పోస్టరుకు ఏ నియమాలు వర్తిస్తాయో, కెమెరాతో తీసిన ఫోటోకు అవే నియమాలు వర్తిస్తాయి. ఈ విధంగా ఆలోచించి చూడండి పుస్తకాన్ని జిరాక్సు తీసినంత మాత్రాన కాపీహక్కులు వర్తించవా? కాపీహక్కులు ప్రకటించేటప్పుడు ఆ కృతిని అనుమతి లేకుండా ఏ విధంగానూ నకలు తీయకూడదని ప్రకటిస్తారు. కాబట్టి పోస్టరును ఫోటో తీయటం కంటే ఏదైనా వెబ్‌సైట్లో ఆ సినిమా పోస్టరు లభిస్తే అది వాడుకోవటం శ్రేయస్కరం. ఫెయిర్ యూజ్‌కు ఎంతో కొంత వెసలుబాటు ఉంది. అనుమతి లేకుండా నకలు తియ్యటానికి అసలు వెసలుబాటే లేదాయె --వైజాసత్య (చర్చ) 05:10, 11 మార్చి 2013 (UTC)
ధన్యవాదములు వైజా సత్య గారు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:15, 11 మార్చి 2013 (UTC)

ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు తెలుగుసేత వికీసోర్స్ ప్రాజెక్టు

భారత డిజిటల్ లైబ్రరీలో 22000పైగా తెలుగు పుస్తకాలు బొమ్మ రూపంలో గ్రహణం చేయబడినవి. వాటిలో 2200 పైగా ఆర్కీవ్. ఆర్గ్ లో ఆన్లైన్ లో చదువుకొనుటకు, మరియు నకలు తెచ్చుకొనుటకు సౌకర్యవంతంగా చేర్చబడినవి. అయితే వీటి పేర్లు ఇంగ్లీషులిపిలో వుండడంతో వీటిగురించి గూగుల్ ద్వారాకూడా తెలుగులో వెతికితెలుసుకొనుటకు వీలులేదు. అందువలన ఈ వికీప్రాజెక్టు ద్వారా పుస్తకము పేరుని,రచయితపేరుని తెలుగులిపిలో వ్రాసే పని ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించవలసినదిగా కోరుచున్నాను. మరిన్ని వివరాలకు ప్రాజెక్టు పేజీ (s:Wikisource:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు) చూడండి. దీనివలన తెవికీలో రచనలు చేసేవారికి వుపయోగకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. --అర్జున (చర్చ) 05:24, 11 మార్చి 2013 (UTC)

 • ఆ ప్రాజెక్టుపేజీ చూడండి. విషయసూచికలో మొదటిఉపపేజీలో మొదటి రెండు మూడు వరుసలు (తెలుగులోకి మార్చినవి) గమనించితే సులభంగా అర్థమవుతుంది.--అర్జున (చర్చ) 08:12, 11 మార్చి 2013 (UTC)
 • ప్రాజెక్టు బాగుంది. ఇవి ఇంటర్నెట్ ఆర్కీవులో ఉచితంగా దొరకుతున్న పుస్తకాలు. అనువాదం జరిగిన తర్వాత ఉత్సాహం చూపిస్తున్న రచయితలు, ఆయా పుస్తకాల యొక్క మొదటి కొద్ది పేజీలలో ఆ పుస్తకానికి సంబంధించిన సమాచారం నుండి వికీపీడియాలో పుస్తక సమీక్షగా వ్యాసం చేర్చి; ఆ తర్వాత వికీసోర్సు కు లింకు ఇస్తే ఆసక్తి కలిగిన వారు దాని నకలీకరణం మీద కేంద్రీకరించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:09, 11 మార్చి 2013 (UTC)

Convert complex templates to Lua to make them faster and more powerful

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians)

Greetings. As you might have seen on the Wikimedia tech blog or the tech ambassadors list, a new functionality called "Lua" is being enabled on all Wikimedia sites today. Lua is a scripting language that enables you to write faster and more powerful MediaWiki templates.

If you have questions about how to convert existing templates to Lua (or how to create new ones), we'll be holding two support sessions on IRC next week: one on Wednesday (for Oceania, Asia & America) and one on Friday (for Europe, Africa & America); see m:IRC office hours for the details. If you can't make it, you can also get help at mw:Talk:Lua scripting.

If you'd like to learn about this kind of events earlier in advance, consider becoming a Tech ambassador by subscribing to the mailing list. You will also be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Guillaume Paumier, via the Global message delivery system. 20:25, 13 మార్చి 2013 (UTC) (wrong page? You can fix it.)

వికీసోర్స్ లో ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము పాఠ్యీకరణ పూర్తి

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము (వికీసోర్స్ లో s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము ) దాదాపు 435 పేజీల పాఠ్యీకరణ పూర్తి అయింది. 1910లో ముద్రించబడిన ఈ పుస్తకం సులభంగా చదువుకోవటానికి, వెతకటానికి, అప్పటి పుస్తక సంబంధిత సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోటానికి (చివరిలోగల ప్రకటనలు) చాలా వుపయోగపడుతుంది. ఇంకా అచ్చుదిద్దవలసినది, సమస్యాత్మకపేజీలు సరిచూడవలసిన పని వున్నది. ముందలరోజులలో సహ సభ్యుల సహకారంతో పూర్తవుతుందని ఆశిస్తాను. దాదాపు 7 నెలలుగా పాఠ్యీకరణలో ప్రముఖంగా సహకరించిన సుజాత గారికి, విక్రమ్ గారికి కృతజ్ఞతలు. దీని స్ఫూర్తితో ఇంకొన్ని పాఠ్యీకరణలు పూర్తయి వికీ ప్రాజెక్టుల అభ్యున్నతిజరగాలని ఆశిస్తున్నాను--అర్జున (చర్చ) 16:16, 16 మార్చి 2013 (UTC)

అర్జునరావుగారూ ! ఇందులో మీరు కృషిచేసింది అధికం. అయినప్పటికీ మీ ప్రశంశకు ధన్యవాదాలు. కొత్తవి ప్రారంభించండి వీలైనంతగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను. --t.sujatha (చర్చ) 04:56, 18 మార్చి 2013 (UTC)
అర్జునరావు, సుజాత మరియు విక్రం గార్లకు ధన్యవాదాలు. ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని వివిధ వ్యాసాలుగా తెలుగు వికీపీడియాలో చేర్చితే చాలా మంచి వ్యాసాలు తెలుగు వికీపీడియాలో తయారౌతాయి. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:29, 18 మార్చి 2013 (UTC)
 • దీనిని వనరుగా కొత్తవ్యాసాలు తయారుచేయటం సులభం ఎందుకంటే దీనినుండి నకలుచేయటానికి అభ్యంతరాలు లేవు. మూలము పూర్తిగా వికీసోర్స్ లో వుందికాబట్టి యథాతథంగా వ్యాసం రాయటం అంత ఉపయోగముండదు--అర్జున (చర్చ) 09:11, 20 మార్చి 2013 (UTC)

ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో వికీపీడియా మహోత్సవం హైదరాబాదులో నిర్వహణ గురించి.

హైదరాబాదులో నిర్వహించబోతున్న తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కి సంబంధించి చర్చించేందుకు ముఖాముఖీ పాల్గొనాలనుకునే వారు వికీపీడియా:సమావేశం గమనించగలరు.

ఈ సందర్భంలో నేనొక పతాకసందేశాన్ని రూపొందించాను.

తెలుగు వికీపీడియా మహోత్సవము

. రహ్మానుద్దీన్ (చర్చ) 13:15, 17 మార్చి 2013 (UTC)

 • పతాక సందేశం బాగుంది. తేదీలు మరియు సంవత్సరం స్పష్టంగా కనిపించడం లేదు.Rajasekhar1961 (చర్చ) 14:38, 17 మార్చి 2013 (UTC)
 • బాగుంది. పరిమాణం వెడల్పు 600 కి తగ్గించితే అన్ని రకాల కంప్యూటర్ తెరలలో జరిపిచూడనవసరం లేకుండా కన్పించవచ్చు. లోగో ల నేపథ్యం తెలుపుగా వుంచండి. తేది కి రంగులు మారిస్తే నేపథ్యం రంగుతో స్పష్టత మెరుగవుతుంది.--అర్జున (చర్చ) 02:56, 18 మార్చి 2013 (UTC)
[1] ఈ పతాకసందేశ బొమ్మ ఎలా ఉంది? రహ్మానుద్దీన్ (చర్చ) 08:12, 18 మార్చి 2013 (UTC)
చాలా బాగుంది. మహోత్సవం యొక్క ప్రచారం కోసం దీన్ని విస్తృతంగా ఉపయోగించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 08:29, 19 మార్చి 2013 (UTC)
పతాక సందేశం బాగుంది. అర్జునరావు గారు చెప్పినట్లు వెడల్పు తగ్గిస్తే మంచిదేమో. ఇప్పుడున్న 800px నుంచి 600-700 మధ్యన ఉంచితే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:19, 19 మార్చి 2013 (UTC)
పరిమాణం తగ్గించాను. --వైజాసత్య (చర్చ) 01:28, 20 మార్చి 2013 (UTC)
 • పతాక సందేశం ఇక్కడ ప్రవేశ పెట్టినప్పటి నుండి, మిగతా అన్ని తెలుగు వికీ అనుబంధ సంస్థలలో మహోత్సవం యొక్క ప్రచారం కోసం పొందుపరిస్తే చాలా బాగుంటుందని తలంచి నా అభిప్రాయము ఆగక తెలియజేస్తున్నాను. సహసభ్యులు స్పందించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:26, 20 మార్చి 2013 (UTC) luchaaa
 • నేను వికీసోర్స్ లో పెట్టాను. మితా వికీలలో ఆయా నిర్వాహకులు చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 08:14, 20 మార్చి 2013 (UTC)
 • 20.3.2013 సమయము గం.04:26 లకు పైన నా అభిప్రాయము చివరన ఈ రోజు కొత్తగా ఒక ఆంగ్ల పదము IP 117.239.53.3, సమయము:10.07, రోజు: 6 ఏప్రిల్ 2013, బైట్లు:(+117) తోటి (బేగంబజార్, ఎ.ఎ.టవర్స్, కె.జి.ఎన్. ట్రావెల్స్ దగ్గర ప్రాంతం, లేదా BHEL-II, రామచంద్రాపురం, హైదరాబాదు) "luchaaa" [2]అని ఎవరి కోసమో పొందు పరచారు. ఇది మాత్రం ఏమీ తెలియని అనామక అమాయకులు చేసింది మాత్రం కాదు. కేవలం (ఇక్కడ) వికీలో తెలిసిన వాళ్ళు లేదా వారికి తెలిసిన ఇతర వికీలను అభిమానించే వాళ్ళు అయినా అయి ఉండవచ్చును. ఇది వ్యక్తి మనసు మీద దాడి అనుకొవచ్చా ? ఇదేమి సంప్రదాయమంటారు ? ఇలాంటి వాటి గురించి ఎక్కడయినా చర్చలు జరిగి ఉంటే తెలిసిన వాళ్ళు దయచేసి లింకులు ఇవ్వగలరు. స్పందించగలరు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:07, 6 ఏప్రిల్ 2013 (UTC)

ఉగాది తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశం

ఉగాది రోజున హైదరాబాదులో జరగనున్న వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం ఆహ్వాన పత్రికలో భాగంగా వ్రాయబడుతున్న వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వికీపీడియా అనే వ్యాసం సభ్యులందరూ పరిశీలించండి. ఇప్పటి వరకు లభించిన సభ్యుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. అనేక మంది వివరాలు కాని చాయా చిత్రాలు కాని ప్రస్థుతం లభ్యం కానందున చేర్చబడ లేదు. ఈ వ్యాసం ప్రింటు చేయబడడాని ఇంకా 48 గంటల సమయం ఉంది కనుక ఆసక్తి కలిగిన సభ్యులు స్పందించండి.

 • సభ్యులు తమ స్వస్థలం ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం వంటి వివారాలు, చాయాచిత్రాలు మీ సభ్యపేజీలలో చేర్చండి.
 • కృషిచేసిన సభ్యుల ఉపశీర్షికలో మీరు అదనంగా చేర్చాలని అనుకున్న వారి వివరాలను చేర్చండి. --t.sujatha (చర్చ) 08:03, 19 మార్చి 2013 (UTC)
మన తెలుగు వికీ సముదాయ సభ్యులు 2013 ఏప్రిల్11 తేదీ 'విజయ' నామ ఉగాది రోజున హైదరాబాద్ లో నిర్వహించ సంకల్పించిన తెలుగు వికీపీడియా మహోత్సవం కోసం ఆహ్వానితులకు మరియు మీడియా వారికి ఆహ్వానపత్రాలతోబాటు జతపరచి పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా తయారుచేస్తున్న వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వ్యాసం దాదాపుగా పూర్తి అయినది. ఉగాది కార్యక్రమానికి ఇంక సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రింటింగు వేగంగా జరగాలన్న ఉద్దేశంతో 21-3-13 గురువారం రాత్రి తో వ్యాసరచన ముగిస్తున్నాము. కావున గౌరవ సభ్యులు ఈ వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వ్యాసాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేయడమే కాకుండా... ఇంకా చేర్చబడని సభ్యులవివరాలు, ఫోటోలను జతపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ... Malladi kameswara rao (చర్చ) 07:52, 20 మార్చి 2013 (UTC)

గతంలో విశేష కృషి చేసిన సభ్యుల వివరాలు

ఆర్యా..... ఆహ్వాన పత్రికలో గతంలొ విశేష కృషి చేసి .... ఏవో కారణాల వల్ల ప్రస్తుతం కనబడని వారి వివరాలు కూడ చేరిస్తే బాగుంటుందని నా అభిప్రయము. అదే విదంగా ప్రస్తుత సభ్యుల వివరాలు కొందరివి చాల క్లుప్తంగా ఒకే లైను మాత్రమే వున్నది. ఆ వివరాలు కనీసం మూడు నాలుగు లైన్లన్నా వుంటే బాగుంటుంది. దానిలో వారి చేసిన కృషి, వారికి లభించిన పథకాలు వంటి వివరాలతొ వుంటే బాగుండునేమో ఆలోచించండి. ఇది పంపిటీ చేసె పత్రము గాన.... చదివేవారికి..... కొత్తగా చేరగోరె వారికి ఉత్సాహాన్నిస్తుందని నా అభిప్రాయము. Bhaskaranaidu (చర్చ) 04:16, 21 మార్చి 2013 (UTC)

Bhaskaranaidu గారు, దాదాపుగా అదేవిధముగా వ్యాస కృషి జరుగుతోందని నా అభిప్రాయము. మీరు వ్యక్త పరచిన విషయములలో మన అందరి బాధ్యత కూడా ఎప్పుడూ ఉంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:54, 22 మార్చి 2013 (UTC)

బాట్ గా గుర్తింపు

వాడుకరి:RahmanuddinBot నేను సృష్టించుకున్న బాట్. ఇది వాడి కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. అధికారి/నిర్వాహక హోదా గల వారు ఈ బాట్ వాడుకరిని బాట్ గా గుర్తించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 21 మార్చి 2013 (UTC)

వికీసోర్స్ లో పాత పాఠ్యపు స్కాన్ లు సరిదిద్దు

నేనుఅసంపూర్తిగా వున్న పాఠ్యాల పాత స్కాన్ లకు బదులు s:మొల్ల రామాయణం (అసంపూర్తి) ( s:మొల్ల రామాయణం (రామా అండ్ కో) (పూర్తి), s:గాన విద్యా వినోదిని, s:ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) పూర్తి స్కాన్లు చేర్చాను మరియు ఇప్పటికే జరిగిన పనిని వీలైన చోట్ల తరలించాను. ఈపై అంశాల పాఠ్యీకరణ చేసేవారు ఇక నిశ్చింతగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 16:12, 22 మార్చి 2013 (UTC)

విక్షనరీలో ఉండవలసిన పేజీలు

తెవికీలో కొన్ని విక్షనరీలో ఉండవలసిన పేజీలున్నాయి. ఉదాహరణకు అనుకూలము పేజీ. వర్గం:సంస్కృత_పదజాలము లోని చాలా పదాలు కేవలం అర్ధం మాత్రమే తెలియజేస్తున్నవి. అవి విక్షనరీకి తరలించాలనుకుంటా. ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 05:16, 26 మార్చి 2013 (UTC)

ఇలాంటి శబ్దార్ధ పేజీలు అనేకం ఉన్నవి.వీటిని వ్యాసంగా పరిగణించరాదు. వీటిని విక్షనరీకి తరలించటమే మంచిది. - -  కె.వెంకటరమణ చర్చ 05:31, 26 మార్చి 2013 (UTC)
లేదా ఆ పదానికి సంబంధించి కొన్ని వాడుకలు, లేదా ఆ పదం పై వచ్చిన వివాదాలు మొదలగునవి చేర్చి వికీపీడియాలో కొనసాగించవచ్చు. ఉదాహరణకు మళయాళం వికీపీడియా లో సంయుక్తాక్షరాలకు, వర్ణాలకు కూడా పేజీలున్నాయి. ఔత్సాహికులకు ప్రోత్సాహమిచ్చి ఆయా వ్యాసాలు తీర్చిదిద్దాలి. రహ్మానుద్దీన్ (చర్చ) 06:06, 26 మార్చి 2013 (UTC)
ఇలా చేస్తే విక్షనరీ లో గల అనేక వేల పేజీలు తెవికీ లోకి దిగుమతి అవుతాయి. అపుడు విక్షనరీ తో పని ఏముంటుంది - -  కె.వెంకటరమణ చర్చ 06:30, 26 మార్చి 2013 (UTC)
సంస్కృత పదజాలము వర్గాన్ని నేనే మొదలుపెట్టాను. ఆంగ్ల వికీపీడియాలొ ముఖ్యమైన సంస్కృత పదాలకు చిన్నవి మరియు పెద్దవి వ్యాసాలున్నాయి. అదే మాదిరిగా కొన్ని ముఖ్యమైన సంస్కృతం నుండి వచ్చిన తెలుగు పదాలకు వ్యాసాలు తయారుచేయడంలో తప్పులేదని పిస్తుంది. ఇది విక్షనరీకి పోటీగా కాదు. విజ్ఞలైన సభ్యులు ఆలోచించి కొన్ని సంస్కృత పదాలకు సంబంధించిన తెలుగు వ్యాసాలను ప్రయత్నించి చూడండి. అలా అవకాశం లేకపోతే అయోమయ నివృత్తి పేజీగా మార్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 11:02, 30 మార్చి 2013 (UTC)

వికీశైలి చర్చ

ఇటీవలి రచ్చబండలో వికీశైలి గురించిన చర్చను వికీపీడియా_చర్చ:ఏకవచన_ప్రయోగం కు తరలించబడింది. పాత చర్చలు కూడా అందుబాటులో వుంటాయికాబట్టి. అక్కడ సహాయంకావాలి మూస చేర్చబడింది. దయచేసి స్పందనలు అక్కడనేరాయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 06:25, 27 మార్చి 2013 (UTC)

మొదటి పేజీ లో మార్పు చెయ్యడం ఎలా

మొదటి పేజీ లో మార్చి 27 (చరిత్ర లో ఈ రోజు) న జరిగిన సంఘటనలలో వయాగ్రాకు అనుమతి ఇచ్చిన సంవత్సరం 1998 అని ఉండాలి,1898 కాదు. దీనిని సరిచెయ్యడం ఎలా? కంపశాస్త్రి 16:10, 27 మార్చి 2013 (UTC) సరిచెయ్యబడింది. ధన్యవాదాలు.కంపశాస్త్రి 16:13, 27 మార్చి 2013 (UTC)

ప్రసారమాధ్యమాల్లో వికీగురించి కొత్తపేజీప్రారంభం

వికీపీడియా:ప్రసార మాధ్యమాల్లో తెలుగు వికీపీడియా లో రామోజీరావు గారు తెలుగు వెలుగు పిభ్రవరి 2013 సంచికలో తెలుగు వికీపీడియాను అభినందిస్తూ రాసిన వ్యాఖ్య చూడండి.--అర్జున (చర్చ) 09:36, 28 మార్చి 2013 (UTC)

విశ్వనాధ్ గారికి వినతి

మీడియా వారికి సౌకర్యంగా ఉండటం కోసం తెలుగు వికీపీడియా ఓపెన్ చేయగానే వచ్చే మొదటి పేజీలో మరిన్ని వివరాలకుచూడండి వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం తో బాటు వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము లింక్ కూడా వుండే విధంగా మార్పు చేయవలసిందిగా నాకోరిక. ...Malladi kameswara rao (చర్చ) 05:58, 30 మార్చి 2013 (UTC)

చేసాను క్రింద చూడండి.విశ్వనాధ్ (చర్చ) 07:30, 30 మార్చి 2013 (UTC)
ధన్యవాదాలు. ..Malladi kameswara rao (చర్చ) 07:39, 30 మార్చి 2013 (UTC)
 :: ఎందుకో మళ్ళీ మొదటి పేజీలో వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము లింక్ చూపించటం లేదు. సరిచేయవలసిందిగా విజ్ఞప్తి. .....Malladi kameswara rao (చర్చ) 10:23, 30 మార్చి 2013 (UTC)

దారిఖర్చులు మరియు వసతి సౌకర్యం

హైదరాబాదుకు బయటనుండి వచ్చు వికీపీడియన్లకు ప్రయాణ మరియు వసతి సౌకర్యం: హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరుకావాలనుకొంటున్న వికీపీడియా సభ్యులకు ప్రయాణ మరియు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) కల్పించటానికి (రైలు ఎసి టు టైర్ చార్జీలకు లోబడి అయిన ఖర్చులకు) పరిమిత నిధులు కేటాయించటమైనది. డిసెంబరు 31, 2012 నాటికి తెలుగు వికీప్రాజెక్టులు అన్నిటిలో కలిపి కనీసం 50 (ఏభై) మార్పులు చేసినవారు దీనికి అర్హులు. ఈ సౌకర్యం "ముందు వచ్చినవారికి ముందు" ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. ఆసక్తిగల సభ్యులు త్వరగా ఈ పేజీలోని ' తప్పక హాజరవుతున్న సభ్యుల ' విభాగంలో మీ పేరు మరియు ఊరు నమోదు చేసుకొనమని కోరడమైనది. వికీ "సభ్యులు original టికెట్టు ఇస్తూ voucher పై సంతకం చేయవలసి వుంటుంది. ఇది CIS-A2K ఆడిటర్ వారి నిభంధన కావున సభ్యులు మన్నించాలని అభ్యర్దన.Rajasekhar1961 (చర్చ) 10:57, 30 మార్చి 2013 (UTC)

Script error

తెవికీలో 3500 పైగా మూసలు (లింకు) పనిచేయడం లేవు. మూస బదులు Script error అని కనిపిస్తుంది. ఎక్కడో పొరపాటు జరిగినట్లుంది. సమయాభావం వల్ల నేను కారణం తెలుసుకోలేకపోయాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:18, 31 మార్చి 2013 (UTC)

 • మూస:Navbox కు లూవా అనే తాజా స్క్రిప్టు మార్పుల వలన జరిగినట్లుంది. పాత రూపుని వర్తించితే తొలగిపోయింది. దీని లూవా స్కృిప్ట్ ప్రవేశపెట్టిన ఇంగ్లీషు వికీపీడియన్ దృష్టికి తీసుకువెళ్తాను .--అర్జున (చర్చ) 23:27, 31 మార్చి 2013 (UTC)
 • అవసరమైన మాడ్యూళ్లను ఇంగ్లీషు వికీ నుండి నకలుచేసి, లూవా స్కృిప్టు రూపు పునురుద్ధరించాను.--అర్జున (చర్చ) 06:36, 15 ఏప్రిల్ 2013 (UTC)
 • రూపు లో సమస్య వున్నందున లూవా మార్పు రద్దుచేశాను. లూవా పైపట్టువున్నవాళ్లు సరిచేయాలి--అర్జున (చర్చ) 08:51, 15 ఏప్రిల్ 2013 (UTC)