"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంకురం (సినిమా)

From tewiki
Revision as of 19:19, 24 January 2021 by imported>స్వరలాసిక (వర్గం:పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
అంకురం
(1992 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం సి. ఉమా మహేశ్వర రావు
తారాగణం ఓం పురి ,
రేవతి
సంగీతం హంసలేఖ
నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఇండియా ఆర్ట్ కగరియేషన్స్
భాష తెలుగు

అంకురం 1992 లో విడుదలై జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన తెలుగు చిత్రం.[1]

కథ

సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.

నటవర్గం

సాంకేతికవర్గం

 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సి.ఉమామహేశ్వరరావు
 • సంగీతం : హంసలేఖ
 • ఛాయాగ్రహణం : మధు అంబట్
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
 • గేయరచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • నిర్మాత: కె.వి.సురేష్ కుమార్

సంగీతం

ఈ చిత్రంలోని పాటలకు హంసలేఖ బాణీలను కూర్చగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు గానం చేశారు.

 • హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని
 • కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే
 • అత్తారింటికి రైలెక్కింది రబ్బరుబొమ్మ!
 • ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

పురస్కారాలు

మూలాలు

 1. పట్టిసపు, శేషగిరిరావు. "నాకు నచ్చిన సినిమా - అంకురం". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Retrieved 4 January 2017.

బయటి లింకులు

en:Ankuram