"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వ యుగము

From tewiki
Jump to navigation Jump to search
260px
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.శ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 - 300
బృహత్పలాయనులు 300 - 350
ఆనందగోత్రికులు 295 - 620
శాలంకాయనులు 320 - 420
విష్ణుకుండినులు 375 - 555
పల్లవులు 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 - 1076
పూర్వగాంగులు 498 - 894
చాళుక్య చోళులు 980 - 1076
కాకతీయులు 750 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి కమ్మ నాయకులు 1149 - 1868
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము 1572 - 1680
పెమ్మసాని కమ్మ నాయకులు 1423 - 1740
కుతుబ్ షాహీ యుగము 1518 - 1687
వాసిరెడ్డి కమ్మ నాయకులు 1314 - 1816
నిజాము రాజ్యము 1742-1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912-1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948-1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953-1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956-2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
(పరిచయం ఇక్కడ వ్రాయాలి)

యుగ విభజన

ముఖ్యాంశాలు

  • క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది.
  • క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము - ఈ కాలంలో చిన్నన పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.
  • క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు.
  • క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.
  • క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది. రామాయణంలో దండకారణ్యం ఆంధ్ర-ఒడిషా ప్రాంతాలలోనిదంటారు. పంపా సరస్సు కొల్లేరు సరస్సని ఒక అభిప్రాయము.[1].

క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము (అగస్త్యుడు చూపినది), మగధ -కళింగ -గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము

వనరులు

  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - [2]
  • ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంధమాల ప్రచురణ - 1950 - [3]

బయటి లింకులు