"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆలపాటి రవీంద్రనాధ్

From tewiki
Revision as of 13:45, 14 July 2020 by imported>Arjunaraocbot (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ఆలపాటి రవీంద్రనాధ్
జననంనవంబరు 4, 1922
మరణంఫిబ్రవరి 11, 1996
వృత్తిపత్రికా సంపాదకులు
ప్రసిద్ధిగాంధేయవాది,సంపాదకులు
మతంహిందూ
తండ్రివెంకట్రామయ్య,
తల్లిఅమ్మెమ్మ

ఆలపాటి రవీంద్రనాధ్ (నవంబరు 4, 1922 - ఫిబ్రవరి 11, 1996) జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు.

జననం

ఆలపాటి రవీంద్రనాధ్ గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం గోవాడలో 1922, నవంబరు 4 న వెంకట్రామయ్య, అమ్మెమ్మలకు జన్మించాడు. జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. వాటి ద్వారా శాస్త్రీయ దృక్పదం, సెక్సు, ఎం.ఎన్.రాయ్ భావాలు ప్రచారం చేశారు. జి.వి.కృష్ణారావు రాసిన సునీధ నాటకాన్ని ఈయనకు అంకితం ఇచ్చారు. డిగ్రీలు లేకుండానే పాండిత్యం గడించి, ఆ పాండిత్యానికి సాంఘిక ప్రయోజనాన్ని చేకూర్చాడు. ఈయనపై తాత దేవయ్య ప్రభావం పడింది. గోవాడ గ్రామం సందర్శించిన మహాత్మాగాంధీని రవీంద్రనాథ్ చూశారు. దేవయ్య ఆధ్వర్యంలో గోవాడలో హరిజనుల్ని గ్రామంలోని బావి నుంచి నీరు తోడుకోనిచ్చారు. గోవాడ సమీపంలోని కావూరులో గొల్లపూడి సీతారామశాస్త్రి వినయాశ్రమం, త్రిపురనేని రామస్వామి అవధానాలు, ఉపన్యాసాలు, రచనలు, తాపీ ధర్మారావుతో పరిచయం వంటి ప్రభావాలతో 1946లో తెనాలిలో జ్యోతి ప్రెస్ ప్రారంభించారు. 'ప్రెస్' లోనే చర్చలు జరిగేవి. జ్యోతి ప్రెస్ కళాకారులు, పండితులు, గాయకులు, నటులు, ఉపాధ్యాయులతో రాడికల్ హ్యూమనిస్టులకు, హేతువాదులకు, స్వతంత్ర ఆలోచనాపరులకు కేంద్రమైంది. భారతీయ చరిత్రను, సంస్కృతిని, తత్వాన్ని, బౌద్ధాన్ని, శాస్త్రీయ దృక్పథంతో చూడాలన్న' రాయ్ భావజాలంతో 'జ్యోతి' అనే పత్రికని, సెక్స్‌ని శాస్త్రీయంగా వివరించడానికి 'రేరాణి' పత్రికని ప్రయోగించారు. రవీంద్రనాథ్ ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ, శారద, ఆలూరి భుజంగరావు, ఎం.ఎల్.నరసింహారావు, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరి కేశవస్వామి... ఇలా ఎంతోమంది రచయితలు వచ్చారు. 'కుటుంబ నియంత్రణ' సశాస్త్రీయమని, అది దేశానికి ఎంతో అవసరమని ప్రచురిస్తే అప్పటి ప్రభుత్వం ఆయన్ని ప్రాసిక్యూట్ చేసింది. సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా ప్రచురిస్తూ ఫ్రాయిడ్, హేవలాక్, ఎల్లీస్, మెస్మర్, యూంగ్, యాడ్లర్ వంటి వారి సిద్ధాంతాలను తన 'రేరాణి' పత్రిక ద్వారా ఆయన పరిచయం చేశారు. తన పత్రికల ద్వారా బుద్ధుడి బోధనలకు విస్తృత ప్రచారం కల్పించారు. బూదరాజు రాధాకృష్ణ, తాళ్లూరి నాగేశ్వరరావు, సి.ధర్మారావు, రావూరి భరద్వాజ వంటి మిత్రులతో చర్చించి... ఆయన మిసిమిని 1990లో పక్షపత్రికగా ప్రారంభించారు. నాలుగు సంచికలు వచ్చాక దాన్ని మాసపత్రికగా మార్చారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ చేత 'మధురవాణి' ఇంటర్వ్యూలు రాయించారు. 'మేధావుల మెతకలు అనే సంపాదకీయం రాశారు. 1995లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

మరణం

1996, ఫిబ్రవరి 11హైదరాబాదులో మరణించారు.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).