"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్)

From tewiki
Revision as of 14:21, 14 July 2020 by imported>Arjunaraocbot (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ఉమామహేశ్వరాలయం

ఉమామహేశ్వరం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామపంచాయతీలో నల్లమల అడవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుండి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.

ఉనికి

శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోన్న ఈక్షేత్రం హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారిపై హైదరాబాదు నుంచి 140 కిమీ దూరంలో ఉంది. మండలకేంద్రం అచ్చంపేట నుంచి 12 కిమీ దూరంలో ఉంది.

పురాణ గాథ

శ్రీశెైలం ఉత్తర ముఖ ద్వారంగా, రెండవ శ్రీశెైలంగా భాసిల్లు తోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతిదేవి శివుడి కోసం తపస్సు చేసిందట. అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాలపాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వర మని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది. ఇక్కడి కొండపెై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువెై ఉన్నాడు.

విశేషాలు

నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది ఉమామహేశ్వరం. క్రీస్తు శకం 1232 లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం హైదరాబాద్‌ నగరానికి 66 కిలోమీటర్‌ దూరంలోనూ, మహబూబ్‌ నగర్‌కు 91, అచ్చంపేటకు 14 కిలో మీటర్ల దూరంలోనూ నెలవెై ఉంది.పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు. కాకతీయుల కాలం నాటి "పండితారాధ్య చరిత్ర"లో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. క్రీ.శ.14వ శతాబ్దిలో మాదానాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లను నిర్మించాడు. ఏటా జనవరి 15 నుంచి ఈ క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కొండ మొత్తం కూడా అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకేచోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగ మహేశ్వరం అని అంటారు. అమ్మవారికి, స్వామివారికి ఐదు గుడులలో ఐదు లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

మూలాలు

ఇతర లింకులు