"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎం.కె.ఆర్. ఆశాలత

From tewiki
Jump to navigation Jump to search
ఎం.కె.ఆర్.ఆశాలత
దస్త్రం:Mkr asalatha.jpg
జీవిత భాగస్వాములుఎం.కె.రాము
పిల్లలుహిమబిందు, అభినందన,
తల్లిదండ్రులు
  • కె.రామచంద్రరావు (తండ్రి)
  • ఇందిర (తల్లి)

ఎం.కె.ఆర్. ఆశాలత ఒక కళాకారిణి, వ్యాఖ్యాత్రి. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ఈమెకు కళారత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది.

జీవిత విశేషాలు

ఈమె తండ్రి కె.రామచంద్రరావు పోలీసు అధికారి. ఈమె విద్యాభ్యాసం కర్నూలు, అనంతపురంలలో జరిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పౌరసంబంధాల శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసింది. ఈమె భర్త ఎం.కె.రాము గేయరచయిత, కవి మరియు రసమయి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సాంస్కృతిక రంగం

ఈమె చదువుకునే రోజులలో అనేక శాస్త్రీయ నృత్యప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ కార్యక్రమాలను రక్తికట్టించింది. దూరదర్శన్‌లో వార్తలు చదివింది. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో అనేక కార్యక్రమాలలో తన గాత్రాన్ని అందించింది. రసమయి సాంస్కృతిక సంస్థ కార్యకలాపాలలో తన భర్తకు చేదోడుగా నిలిచింది. ఫిల్మ్‌ సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా అనేక చలనచిత్రాలను సెన్సార్ చేసింది.

పురస్కారాలు

ఈమెకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 2015 సంవత్సరం ఉగాది రోజున ఈమె సాంస్కృతిక రంగానికి ముఖ్యంగా వ్యాఖ్యాన రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా కళారత్న (హంస) పురస్కారాన్ని ప్రదానం చేసింది[1]. ఈ పురస్కారం క్రింద 50,000 రూపాయలు నగదు, జ్ఞాపిక అందజేశారు.

మూలాలు

  1. Teluguone. "పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు". తెలుగు వన్ న్యూస్. Retrieved 10 May 2018.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).