ఎం.గురురాజు

From tewiki
Revision as of 18:27, 23 July 2020 by imported>InternetArchiveBot (1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దస్త్రం:Gururaju.jpg
ఎం.గురురాజు

ఎం.గురురాజు హోమియోపతి వైద్య శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

డా.గురురాజ్ జూన్ 28 1897 లో జన్మించారు. ప్రారంభంలో ఆయన ఒక ఉపాధ్యాయునిగా పనిచేసారు. తరువాత 1922లో అల్లోపతిలో వైద్య పట్టాను(ఎం.బి.బి.ఎస్) ను మద్రాసు మెడికల్ కాలేజీ నుండి పొందారు. 1924 లో గుడివాడలో అల్లోపతి ప్రాక్టీసు మొదలుపెట్టారు. 1932 లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. జైలునుండి విడుదలైన తరువాత ఆయన పేదలకు సేవలందించాలన్న సదాశయంతో గ్రామీణ ప్రాంతంలోనే హోమియోపతి ప్రాక్టీసు మొదలుపెట్టారు. తరువాత ఆయన యు.ఎస్.ఎ కు వెళ్ళి హోమియోపతి లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందారు. అచట హోమియోపతి దిగ్గజాలైన డా.వుడ్‌బరీ, డా.రాబర్ట్స్, డా.స్పాల్డింగ్, డా.ఎలిజబెత్ హబ్బర్డ్ వంటి వారితో కలసి పనిచేసే అవకాశం లభించింది.[1]

వైద్య సేవలు

గ్రామీణ ప్రాంతంలో ప్రాక్టీసు ప్రారంభించిన తరువాత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి కలిగి శాసనోల్లంఘన ఆందోళనలో పాల్గొన్నారు. కారాగార శిక్ష పడిన తరువాత జైలు వాసంలో హోమియోపతి వైద్య విధానం మీద వెలువడిన గ్రంథాలను చదివే అవకాశం కలిగింది. ఈ సందర్భమే ఈయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. రోగలక్షణాలను చికిత్స చేయడమనే ప్రక్రియ హోమియోపతి వైద్య చికిత్సా విధానంలో ఉందని, ఈ విలక్షణమైన చికిత్సను చేపట్టి పరిశోధనలు చేయాలని కారాగార వాసంలోనే నిర్ణయించుకున్నారు. జీవితకాలమంతా ప్రామాణికంగా పనిచేసే మందులలో దివ్యత్వం ఉందని భావించిన గురురాజు జైలు నుండి వెలుపలికి వచ్చిన తరువాత అల్లోపతికి స్వస్తివచనం పలికారు.[2]

1936లో ప్రసిద్ధ హోమియో వైద్యుల వద్ద శిక్షణ పొందుతూ ఆ మందులమీద పరిశోధనలు ప్రారంభించారు. నూతన ఔషథ మిశ్రమాలను ఆవిష్కరించారు. హోమియో వైద్యంతో పాటు ప్రచారాన్ని కూడా ఉధృతం చేసారు. నాటు వైద్యాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజలను హోమియో వైద్యం వైపు మరల్చడానికి ఎన్నోన్నో ప్రయాసలు పడ్డారు. రోగుల పట్ల ఆత్మీయంగా మసలి, వారి ప్రగాఢ విశ్వాసాన్ని పొందారు. 1945 లో హోమియో కళాశాలను ప్రారంభించారు.[3]

డా.గురురాజు గుడివాడ మ్యునిసిపల్ కౌన్సిల్ కు రెండుసార్లు ఎన్నికైనారు. ఆయన ఎ.పి.హోమియోపథిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఆయన భారతీయ హోమియో థెరపీ బోర్డులో మెంబరుగా 1956 నుండి ఉన్నారు.[4] ఆయన లక్నోలో 1951 లోజరిగిన రెండవ ఆల్ ఇండియా హోమియోపథిక్ కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఉన్నారు.

మూలాలు

  1. "HOMOEO HISTORY". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-14.
  2. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్కిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 133.
  3. "Dr. Gururaju Government Homoeopathic Medical College (DGGHMC), Krishna". Archived from the original on 2015-12-06. Retrieved 2015-06-14.
  4. "PHOTOTHÈQUE HOMÉOPATHIQUE". Archived from the original on 2016-03-06. Retrieved 2015-06-14.

ఇతర లింకులు