ఎమ్వీయల్. నరసింహారావు

From tewiki
Revision as of 16:42, 3 June 2019 by imported>Chaduvari (+ 3 వర్గాలు; ±వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులువర్గం:కృష్ణా జిల్లా రచయితలు (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ఎమ్వీయల్. నరసింహారావు (1944 - 1986) సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. ఈయన పూర్తిపేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు. ఈయన సెప్టెంబరు 21, 1944 సంవత్సరంలో గూడూరు లో జన్మించాడు. బందరు లో డిగ్రీ చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. పూర్తిచేశాడు. నూజివీడు లోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరి చివరివరకు పనిచేశాడు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం విజయవంతంగా నిర్వహించాడు. 'తాగుడుమూతలు' శీర్షిక కూడా వీరిదే. 1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి, ముత్యాల ముగ్గు సినిమా నిర్మించాడు. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.