కందం

From tewiki
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.

క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్

యిందు గణములు

కంద పద్యములో ఉండవలసిన గణములు
గ గ నల
U U U I I I U I I I U I I I I

లక్షణములు

 • పాదాలు=4
 • కందపద్యంలో అన్నీ నాలుగు గణాలు మాత్రమే ఉంటాయి. గగ, , , , నల ఇవీ ఆ గణాలు
 • 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
 • 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
 • 1,3 పాదాలలో 1,3 గణాలు గణం కారాదు.
 • 2,4 పాదాలలో 2,4 గణాలు గణం కారాదు.
 • 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) కాని, నల కానీ అయి ఉండాలి.
 • 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ లేదా అయి ఉండాలి.
 • పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలుకావాలి.
 • యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.
 • ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.

ఉదాహరణ 1

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింటు గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

ఉదాహరణ 2

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తే
భూ త ల నా థు డు రా ము డు
గ గ గ గ నల
ప్రీతుం డై పెం డ్లి యాడె బృథుగుణ మణి సం
గ గ గ గ గ గ
ఘాతన్ భాగ్యో పేతన్
గ గ నల గ గ
సీతన్ ముఖకాం తి విజిత సితఖ ద్యోతన్

కంద పద్యమునందు గణముల వివరణ

గగ గణము = UU { గురువు, గురువు }

భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }

జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }

స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}

నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

మూలాలు