కందము

From tewiki
Redirect page
Jump to navigation Jump to search

దారి మార్పు:

విషయ సూచిక

1 కందం
2 ఉదాహరణ 1
3 లక్షణములు
4 ఉదాహరణ 2

కందం

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. ఉదాహరణ 1

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

లక్షణములు

>open

క.

కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్

బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.

</open

పాదాలు: 4
కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి

యతి

2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి

ప్రాస

ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ 2

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

పై పద్యానికి గణములు లెక్కిస్తే

భ గణము భ గణము భ గణము

గగ గణము గగ గణము జ గణము నల గణము స గణము

గగ గణము గగ గణము గగ గణము

గగ గణము స గణము నల గణము స గణము గగ గణము

భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }

గగ గణము = UU { గురువు, గురువు }

జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }

నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}