Open main menu

కల్పనా రాఘవేంద్ర

కల్పనా రాఘవేంద్ర సింగర్‌, నటి, డబ్బింగ్ ఆర్టీస్ట్ తమిళనాడుకు చెందిన కల్పన చిన్నప్పటి నుంచే సింగర్‌కావానుకుని సాధన చేయడం మొదలు పెట్టింది. కెరియర్‌ తమిళంలో మొదలు పెట్టినా కూడా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ నటి, డబ్బింగ్ ఆర్టీస్ట్. చాలా కష్టమైన పాటను అలవోకగా పాడగల సత్తా ఉన్న సింగర్‌. అందుకే అందరు కల్పనను రాక్షసి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎంతటి కఠోరమైన పాటలను అయినా కూడా చాలా తేలికగా మంచినీళ్లు తాగినట్లు పాడేయగ సత్తా ఉన్న సింగర్‌.

కల్పనా రాఘవేంద్ర
జన్మనామం కల్పనా రాఘవేంద్ర
సంగీత రీతి నేపథ్యగానము, కర్ణాటక సంగీతము
వృత్తి గాయని
వాయిద్యం గాత్రము

తల్లిదండ్రులు,కుటుంబం,బాల్యం

కల్పనా తండ్రి టి.యస్. రాఘవేంద్ర తన సమయములో ప్రముఖ నేపథ్య గాయకుడు, ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు .ఆమె తమ్ముడు షికినా షాన్ ఒక ఒపెరా సింగర్. ఆమె మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని పూర్తి చేసింది కల్పనకు మధురై టి. శ్రీనివాసన్ శిక్షణ ఇచ్చారు. ఐదు సంవత్సరాల వయస్సులో, కల్పన మొదటి సంగీత దర్శకుడు సాలూరి వాసురావుచే కూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. ఎక్కువ ప్రదర్శనలను ఇండియాలో కాకుండా వెలుపల కూడా చేసింది.

బాలనటి

30 సినిమాలో భాలనటిగా దక్షిణ భారతీయ భాషల్లో నటించారు.

దక్షిణ భారతీయ భాషల్లో

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 3000 లకు పైగా పాటలు పాడారు.

వృత్తి జీవితం

మెలోడి సాంగ్స్‌తో పాటు.. రాగాలాపనమైన పాటలను అనేకం పాడారు. అలాంటి పాటలను పాడటానికి కేవలం కల్పననే ఎంచుకునే వారు. శంకర్ మహదేవన్, డ్రమ్స్‌శివమణి, మణిరత్నం వంటి వారు టాప్‌దర్శకులు కల్పనతోనే పెద్దపెద్ద పాటు పాడిరచేవారు.1999 లో మణిశర్మ దర్శకత్వంలో మనోహరం (తెలుగు సినిమా) కోసం మంగళగౌరి పాట కోసం ఆమె స్వరాన్ని ఇచ్చినప్పుడు కల్పనకు మంచి పేరు వచ్చింది. ప్లేబ్యాక్ గాయకులు, స్వరకర్తలు ఎ.ఆర్. రెహమాన్, ఇళయరాజా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.వి.మహదేవన్, కె. ఎస్. చిత్ర వంటి అనేక గత స్వరకర్తలు, గాయకులతో పనిచేశారు. ఈ మధ్య ఆమె ఈటీవి జెమినిటీవి, మాటీవీతో చాలా అనుబంధాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఈటీవి నిర్వహించే ప్రతి పాటల ప్రోగ్రాంలో కల్పన పాటలను కచ్చితంగా పాడిస్తున్నారు. ఈటీవి స్వరాభిషేకం కార్యక్రమం మొదలు అయినప్పటి నుంచీ ప్రతి కార్యక్రమంలో కూడా కల్పనకు ఈటీవి పెద్ద పీట వేస్తోంది. రామోజీరావుకి కూడా కల్పన అంటే చాలాకాలంగా ప్రత్యేకమైన అభిమానం. మాటీవీలో బిగ్ బాస్ షోలో కల్పనకు మంచి పేరు వచ్చింది.

అవార్డులు

ప్లేబ్యాక్ సింగర్‌ కూడా నంది అవార్డు అందుకున్నారు.

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ గాయని - నవ మూర్తులైనట్టి (ఇంటింటా అన్నమయ్య)[1][2][3][4]

మూలాలు

  1. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in English). 2017-03-01. Retrieved 25 June 2020.
  2. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  3. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  4. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  1. https://www.youtube.com/watch?v=xpxtyeMB6Z8
  2. https://www.youtube.com/watch?v=ReZyLY6bTuo

ఇతర లింకులు

బయటి లింకులు