కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

From tewiki
Revision as of 15:55, 2 April 2021 by Deepa.indicwiki (talk | contribs) (Created page with '{{Infobox Indian politician | name = కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | image = | birth_date = న...')
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - ఇప్పటి వరకు
నియోజకవర్గం కోరుట్ల, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం నవంబర్ 10, 1953
రాఘవపేట, మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పాపారావు, సత్తమ్మ
జీవిత భాగస్వామి సరోజన
సంతానం డాక్టర్ సమత, డాక్టర్ సంజయ్
నివాసం కోరుట్ల, తెలంగాణ

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కోరుట్ల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.[1]

జననం

విద్యాసాగర్ రావు 1953, నవంబరు 10న పాపారావు, సత్తమ్మ దంపతులకు జగిత్యాల జిల్లా,మల్లాపూర్ మండలం, రాఘవపేట గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం

స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం, జగిత్యాలలో పదో తరగతి, నిజామాబాదు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాదులోని వివేకవర్ధిని కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు.

రాజకీయ విశేషాలు

1997లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2001లో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరపున గెలుపొంది, జెడ్పీలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్నారు. 2002 నుంచి మూడేళ్ళ పాటు కరీంనగర్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పని చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు కారణంగా మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ మెట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలనే సంకల్పంతో 2008లో కెసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గంగా ఏర్పడిన కోరుట్ల నుంచి 2009లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావుపై గెలుపొందారు. 2010 ఫిబ్రవరిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావుపై రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారు.[2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3] 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

మూలాలు

  1. Kalvakuntla Vidyasagar Rao. "Kalvakuntla Vidyasagar Rao". Myneta.info. Retrieved 28 April 2019.
  2. Kalvakuntla Vidyasagar Rao. "Korutla Assembly Elections". Retrieved 28 April 2019.
  3. Kalvakuntla Vidya Sagar Rao. "Kalvakuntla Vidya Sagar Rao". nocorreption.in. Retrieved 28 April 2019.