కాంచన (సినిమా)

From tewiki
Revision as of 07:07, 24 June 2019 by imported>ChaduvariAWBNew (AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక, నాద → నాథ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

కాంచన నటి కోసం కాంచన చూడండి.

కాంచన (సినిమా)
(1952 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం ఎస్.ఎమ్.శ్రీరాములు
తారాగణం కె.ఆర్.రామస్వామి,
లలిత,
పద్మిని,
ఎం.ఆర్.సంతానలక్ష్మి,
ఆర్.ఎస్.మనోహర్,
ఎం.ఎన్.నంబియార్,
టి.ఎస్.దురైరాజ్,
కుమారి తంగమ్,
పి.ఎస్.జ్ఞానమ్,
కె.దురైస్వామి,
ఎన్.ఎస్.నారాయణ పిళ్ళై,
ఎన్.కమలం
సంగీతం ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

కాంచన 1952లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. ఇది ఏకకాలంలో తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో నిర్మించబడింది. పక్షిరాజా పతాకంపై ఈ చిత్రాన్ని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మించి దర్శకత్వం వహించాడు. మలయాళంలో ఈ సినిమా పేరు కాంజన[1] ఇది డా. త్రిపురాసుందరి అనే యువ వైద్యురాలు లక్ష్మీ అనే కలం పేరుతో వ్రాసిన ప్రసిద్ధ తమిళ నవల కాంచనయిన్ కనవుపై ఆధారితమైనది.[2] ఈ నవల ఆనంద వికటన్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకుల ఆదరణ పొందింది[3] ఈ నవల యొక్క ప్రాచుర్యాన్ని గమనించి శ్రీరాములు నాయుడు ఈ కథను సినిమాగా తీయటానికి హక్కులు పొంది సినిమాను నిర్మించాడు.[4]

నటీనటులు

 • కె.ఆర్.రామస్వామి - రాజేశ్వరరావు
 • లలిత - కాంచన
 • టి.ఎస్.దురైరాజ్ - కొండయ్య
 • పద్మిని - భానుమతి
 • ఎం.ఎన్.నంబియార్ - గిరీశం
 • కుమారి - డాక్టర్ సీత
 • వి.రామశర్మ - డాక్టర్ ప్రసాద్
 • ఋష్యేంద్రమణి - పార్వతీబాయి
 • దొరస్వామి - రామదాసు
 • ఎం.ఆర్.సంతానలక్ష్మి - గంగారత్నం
 • ఎన్.ఎస్.నారాయణపిళ్లై - వకీలు
 • కె.ఎస్.కమలం - బంగారమ్మ
 • కుమారి తంగమ్‌ - రీటా

సాంకేతికవర్గం

 • కథ : లక్ష్మి
 • దర్శకత్వం : ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
 • మాటలు : తోలేటి వెంకటరెడ్డి, జి.వి.ఆర్.శేషగిరిరావు
 • పాటలు: తోలేటి వెంకటరెడ్డి
 • సంగీతం : ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు
 • నేపథ్య గానం: పెరియనాయకి, ఎం.ఎల్.వసంతకుమారి,ఆర్.జయలక్ష్మి
 • నృత్యం : గోపీసాబ్
 • ఆర్కెస్ట్రా : పక్షిరాజా స్టూడియోస్, కోయంబత్తూరు

కథ

మానాపురం జమీందారు రాజేశ్వరరావు తల్లి పార్వతీభాయి ప్రాపకంలో పెరిగి పెద్దవాడవుతాడు. తల్లి మాట పెడచెవినపెట్టి మిత్రుడైన గిరీశం సలహాతో ఒక మిల్లు కట్టడం ప్ర్రారంభిస్తాడు. రాజేశ్వర్రావు సహృదయుడు, కళాభిమాని. ఆటాపాటా అంటే సరదా. ఆ సరదాతోనే భానుమతి అనే ఆటగత్తెతో స్నేహం చేస్తాడు. భానుమతి వేశ్యకులంలో తప్పబుట్టింది. వేశ్యావృత్తితో ధనసంపాదన చేయాలన్న తన తల్లి మాటను వినక రాజేశ్వర్రావును ప్రేమిస్తుంది. మానాపురం పెద్ద జమీందారు దగ్గర పనిచేసిన రామదాసు ఆ జమీందారు ఇచ్చిన యింట్లో ఉంటూ స్వల్ప అద్దె చెల్లిస్తూ మనుమడు ప్రసాద్, మనుమరాలు కాంచనతో కాలం వెళ్లబుచ్చుతుంటాడు.

కొత్త ఉద్యోగి కొండయ్య జమీందారిణి ఆసరాతో రామదాసును యింటి అద్దె నెపంతో నానా బాధలూ పెడుతుంటాడు. ఈ విషయం రాజేశ్వరరావు తెలుసుకొని తన నౌకరు చేసిన తప్పుకి కమాపణ కోరడానికి ఒకనాడు రామదాసు ఇంటికి వెళతాడు. రామదాసు మనవరాలు కాంచనను చూసి, ఆమెను ప్రేమిస్తాడు. తల్లి ఎంతచెప్పినా వినకుండా కాంచనను పెళ్ళిచేసుకుంటాడు.

ఈ పెళ్ళి తమ ప్రేమకు లోటు పరచదని భానుమతికి నచ్చచెబుతాడు. కాంచన పేరుకు జమీందారిణి అయినా అత్తగారు, భర్త తన పేదరికాన్ని గుర్తుచేస్తూ దెప్పిపొడుస్తుంటారు. తన భర్తకు భానుమతికి ఉన్న సంబంధం ఒకనాడు తెలిసిపోతుంది. భర్త హృదయం యింకొక స్త్రీ ఆధీనమైనదని తెలుసుకుని బాధ పడుతుంది.

భానుమతి కాంచనను రాజేశ్వరరావు నుండి వేరుచేద్దామని ప్రయత్నించి విఫలమౌతుంది. రాజేశ్వరరావు గిరీశం ప్రోద్బలంలో మిల్లు పూర్తి చేయడానికి అప్పుల పాలవుతాడు. కాంచనకు కొడుకు పుడతాడు. పిల్లాడి సంరక్షణ అంతా పార్వతీభాయి చూసుకుంటూ కాంచనను దూరం పెడుతూ అవమానిస్తుంటుంది.

డాక్టర్ ప్రసాద్ తనతో పనిచేస్తున్న డాక్టర్ సీతని ప్రేమిస్తాడు. సీత రాజేశ్వరరావు బంధువు అని తెలుసుకుంటాడు. తనకి కాబోయే వదిన మానాపురం వస్తున్నదని చెల్లెలికి ఉత్తరం వ్రాస్తాడు. వదిన రాక విని కాంచన ఎంతో మురిసిపోతుంది. రాజేశ్వరరావు సీతను చూడగానే భానుమతి కాంచనల ప్రపంచాన్ని మరిచిపోయి సీతను వెంబడిస్తుంటాడు. రాజేశ్వరరావు వాలకం చూచి సీత అసహ్యించుకుంటుంది. కాంచన సీతను అనుమానిస్తుంది. ఒకనాడు కాంచనని సీత సమక్షంలో రాజేశ్వరరావు కొడతాడు. సీత మానాపురం నుండి వెళ్లిపోతుంది. సీత తిరస్కారానికి కాంచనే కారణమని రాజేశ్వరరావు ఆమెను మరింత బాధ పెడతాడు. ఈ బాధలు అడలేక కాంచన ఒక అర్ధరాత్రి తన బిడ్డతో యిల్లువదిలి వెళ్ళిపోతుంది. కాంచన, పనిమనిషి కన్నమ్మ యింట్లో ఉన్నదని తెలుసుకొని రాజేశ్వర్రావు, కాంచనని నాయింట్లో అడుగుపెట్టే యోగ్యత లేదని కుర్రాణ్ణి మాత్రం తీసుకొచ్చేస్తాడు. కాంచన దిక్కులేనిదైపోతుంది. పార్వతీబాయి కాంచన లేని లోపాన్ని తెలుసుకొని మంచాన పడుతుంది. రాజేశ్వరరావు పిల్లాణ్ణి భానుమతికి అప్పచెబుతాడు. ఎలాగైనా కాంచనను యింటికి తీసుకురమ్మని రాజేశ్వర్రావును ఒక వైపు తల్లి మరోవైపు భానుమతి పోరుపెడుతుంటారు. ఈ కష్టాలన్నిటినీ రాజేశ్వరరావు ఎలా అధిగమిస్తాడు అనేది మిగిలిన కథ.[5]

పాటలు

ఇందులోని 10 పాటల్ని తోలేటి రచించారు.[6]

 1. ఇకపైన ఎపుడైనా వారికి నాకు సరిపోవదే పోవే -
 2. ఇదేనా ప్రేమతీరేనా యిలాగా నా జీవపడవము -
 3. ఓ ఓ ఓ ఏతాం ఎక్కేనే తోక్కేదా నీరూనించేద ఏతాంయిలాగ -
 4. ఓ మోహన రూపా నాథగు నాట్యము లోకములేలే ప్రేమ -
 5. చందమామ రావే అందాల రాశి రావే కొండమీద -
 6. చిన్నచిలకా పలికేనా చిందులాడే తేనెలూర -
 7. పరమపావనీ దయగనవే నీ పదముల నా మదిలో -
 8. ప్రేమసుమమాల కాలరాసేనే మేలివలపేల యిటుల -
 9. ప్రేమించితీ నిను ప్రియమోహనా నీ దాననే నిజముగా -
 10. మాయే-త్వమ్ యాహే మాంపాహి తుమ్ కాహి -

మూలాలు