"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్త భావయ్య

From tewiki
Revision as of 20:31, 13 February 2020 by imported>Yarra RamaraoAWB (→‎top: clean up, replaced: మండలము → మండలం, typos fixed: బడినది. → బడింది., లో → లో , భోధకు → బోధకు, → , , → ,)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
కొత్త భావయ్య చౌదరి
200px
జననంజూన్ 2, 1897
గుంటూరు మండలం, సంగం జాగర్లమూడి
మరణం1973
ప్రసిద్ధిచారిత్రక పరిశోధకుడు
Notes
కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు

కొత్త భావయ్య చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి లో జూన్ 2, 1897లో శివలింగయ్య రాజమ్మ దంపతులకు జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.ఆంధ్ర, కర్ణాటక, తమిళ దేశములందు దొరికిన శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి, ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి కమ్మవారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు[1]. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడింది.[2].మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, ఆంధ్ర రాజులు[3], గుంటూరు మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, పరశురామ నాటకము, వినోద కథలు, ప్రబోధకుసుమావళి.భావయ్య 23.7.1973 న మరణించాడు.

మూలాలు

  1. కమ్మవారి చరిత్రము, కొత్త భావయ్య చౌదరి, 1939
  2. A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, 1954, Sangam Jagarlamudi, Andhra Pradesh
  3. ఆర్కీవు.కాంలో ఆంధ్ర రాజులు పుస్తక ప్రతి.