"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఖగ్గవిసాణ సూత్రం

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Rhino from Nepal (3080551876).jpg
భారతీయ ఖడ్గమృగం నేపాల్ అడవుల్లో.

ఖగ్గవిసాణ సూత్రం బౌద్ధమతం తొలినాళ్ళలో వ్రాయబడిన సూత్రం. సంఘం (గుంపు) లో సన్యాసులు సంఘంగా ఉంటూ సన్యసించడం కంటే ఒంటరిగా సన్యసించడంలో ఉన్న లాభాన్ని నిరూపిస్తుంది.ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం ప్రతి భిక్కుని కూడా ప్రత్యేకబుద్ధుడిగా మలచడం. ప్రత్యేకబుద్ధుడు అడవిలో ఒంటరిగా ఒక ఖడ్గమృగంలా సంచరించే వాడు.

మూలం

ఖడ్గమృగం సూత్రం పాళీ భాషలో ఉన్న అష్టకవర్గం, పారాయణవర్గంలోని తొలి పాఠ్యాల్లోదిగా గుర్తించబడింది. ఈ గుర్తింపును నిర్ధారిస్తూ గాంధార బౌద్ధ పాఠ్యాలలో ఈ సూత్రం ఉంది. ఇది భారతీయ రాతప్రతుల్లోనే తొలి రాతప్రతి కావచ్చు అని ఒక వాదన ఉంది. కొన్ని బౌద్ధ మత సంస్కృత పాఠ్యాల్లో కూడా ఈ సూత్రం కనిపిస్తుంది.[1] సంఘం (గుంపుగా) ద్వారానే జీవితం గడిపే బౌద్ధ మతంలో ఇలాంటి సూత్రం ఉండట ఆశ్చర్యకరమే. అయితే ఈ సూత్రం బౌద్ధ మతం వ్యాప్తి చెందని తొలినాళ్ళలో ప్రతిపాదించబడి ఉండవచ్చని అనుకుంటున్నారు.

విషయవస్తువు

ఈ సూత్రంలోని పదాలు సంఘంలో బ్రతకటంలో ఉన్న కష్టాలను, ఒంటరిగా ఉండటంలో ఉన్న లాభాలను సూచిస్తూ ప్రతి బౌద్ధ భిక్కు అడవిలో ఒంటరిగా తిరిగే ఖడ్గమృగంలాగా బ్రతకాలని చెబుతుంది. వేరు వేరు రూపాంతరాలలో ఈ సూత్రం మారుతూ ఉంటుంది. కొన్ని రూపాంతరాలలో అయితే పదాల వరుస కూడా మారుతుంది. ఇది వ్రాతప్రతిగా మార్చబడటానికి ముందు వివిధ శృతిసమూహాల వద్ద మౌఖిక వాఙ్మయంగా ఉండి ఉండవచ్చన్నది సత్యం.

మూలాలు

బయటి లంకెలు