Open main menu

గణేష్ (2009 సినిమా)

గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.

గణేష్
దస్త్రం:Ganesh poster.jpg
దర్శకత్వంఎం. శరవణన్
నిర్మాతస్రవంతి రవికిషోర్
రచనశ్రీ స్రవంతి మూవీస్ టీం
స్క్రీన్ ప్లేఎం. శరవణన్
నటులురామ్, కాజల్ అగర్వాల్
సంగీతంమిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల
24 సెప్టెంబరు 2009 (2009-09-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు15 కోట్లు
బాక్సాఫీసు 5 కోట్లు

కథా నేపథ్యం

గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

Untitled

దీనికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3] 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాటలను విడుదల చేశాడు.[1]

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "తనేమందో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  జావేద్ ఆలీ 4:15
2. "లల్ల లాయి (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కృష్ణచైతన్య, శ్వేత పండిట్ 4:42
3. "ఏలే ఏలే (రచన: రామజోగయ్య శాస్త్రి)"  శ్రీమథుమిత 4:43
4. "రాజకుమారి (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కునాల్ గంజావాలా, శ్రీమథుమిత 4:36
5. "ఛలో ఛలోరే (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కార్తీక్ & కిడ్స్ కోరస్ 4:53
6. "రాజా మహరాజా (రచన: రామజోగయ్య శాస్త్రి)"  రంజిత్ 4:51
మొత్తం నిడివి:
28:00

మూలాలు

  1. 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
  2. "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
  3. "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 5 August 2020.

ఇతర లంకెలు