"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గూగుల్ లిప్యంతరీకరణ

From tewiki
Revision as of 07:48, 16 August 2020 by imported>యర్రా రామారావు (2401:4900:2167:1507:8583:E560:3981:92F7 (చర్చ) చేసిన మార్పులను 171.253.138.31 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దస్త్రం:Google tranliteration telugu input .png
గూగుల్ ప్రవేశపెట్టు పద్ధతులలో లిప్యంతరీకరణ అతి దగ్గరి సరియైన పదాన్ని సూచిస్తుంది, ఖాళీ ఇవ్వగానే ఆ పదము ప్రవేశపెట్టబడుతుంది.

గూగుల్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి (కీబోర్డు లోని స్పేస్ బార్) నొక్కితే గూగుల్ దాన్ని తెలుగులోకి మారుస్తుంది. టైపు చేస్తూ ఉండగానే ఆ అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలను ఊహించి చూపిస్తుంది.[1] విండోస్, మ్యాక్, యూనిక్స్ లాంటి ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి (బ్రౌజరు) లో దీన్ని వాడవచ్చు. గూగుల్ క్రోమ్మూస:ZWNJబుక్ వాడుకరులకు నేరుగా ఆపరేటింగు వ్యవస్థలోనే ఈ సౌకర్యం ఉంది. దస్త్రం:Google Telugu Smart input.ogv

చరిత్ర

గూగుల్ లిప్యంతరీకరణ తొలిగా 2007 ఆగస్టు 20 న విడుదలైనపుడు 19 భాషలలో పనిచేసేది. [2] ఇది గూగుల్ సైట్లలో (జీమెయిల్, బ్లాగర్ లాంటి) పనిచేస్తుంది. అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్‌లైన్) వాడాలంటే విండోస్ కంప్యూటర్లలో స్థాపించుకోవటానికి సాఫ్ట్‌వేర్[3] అందుబాటులో ఉంది. విండోస్, లినక్స్, మాక్ ఒఎస్ లాంటి ఏ నిర్వహణ వ్యవస్థైనా, వాటిలో పనిచేసే విహరిణులు (బ్రౌజర్) (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్‌ఫాక్స్, సఫారి, గూగుల్ క్రోమ్ ) లో తెలుగు టైపు చేయడానికి బుక్ మార్క్ లెట్ [4] ద్వారా వాడుకునే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతిక అంశం పనిచేయడం ఆగిపోయింది. [5]

ఇటీవలి విడుదల

2019 మార్చి 28 న విడుదలైన క్రోమ్ విహరిణి ఎక్స్టెన్షన్ 52 భాషలకు పనిచేస్తుంది. [6]

ఇవీ చూడండి

వనరులు

  1. "గూగుల్ ఇన్పుట్ సాధనాలు -లిప్యంతరీకరణ". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
  2. "గూగుల్ లిప్యంతరీకరణ". Archived from the original on 2010-01-17. Retrieved 2010-08-28.
  3. "గూగుల్ లిప్యంతరీకరణ ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ (విండోస్ వాడుకరులకు)". Archived from the original on 2009-12-18. Retrieved 2010-09-08.
  4. "బుక్ మార్క్ లెట్ స్థాపన, వాడుటకు సహాయం". Archived from the original on 2010-08-22. Retrieved 2010-09-08.
  5. Brian Donohue. "Bookmarklets are Dead…". Retrieved 2019-09-04.
  6. "Google Input tools". 2019-03-28. Retrieved 2019-09-04.