"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గూగుల్ లిప్యంతరీకరణ
గూగుల్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి (కీబోర్డు లోని స్పేస్ బార్) నొక్కితే గూగుల్ దాన్ని తెలుగులోకి మారుస్తుంది. టైపు చేస్తూ ఉండగానే ఆ అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలను ఊహించి చూపిస్తుంది.[1] విండోస్, మ్యాక్, యూనిక్స్ లాంటి ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి (బ్రౌజరు) లో దీన్ని వాడవచ్చు. గూగుల్ క్రోమ్మూస:ZWNJబుక్ వాడుకరులకు నేరుగా ఆపరేటింగు వ్యవస్థలోనే ఈ సౌకర్యం ఉంది. దస్త్రం:Google Telugu Smart input.ogv
Contents
చరిత్ర
గూగుల్ లిప్యంతరీకరణ తొలిగా 2007 ఆగస్టు 20 న విడుదలైనపుడు 19 భాషలలో పనిచేసేది. [2] ఇది గూగుల్ సైట్లలో (జీమెయిల్, బ్లాగర్ లాంటి) పనిచేస్తుంది. అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ కంప్యూటర్లలో స్థాపించుకోవటానికి సాఫ్ట్వేర్[3] అందుబాటులో ఉంది. విండోస్, లినక్స్, మాక్ ఒఎస్ లాంటి ఏ నిర్వహణ వ్యవస్థైనా, వాటిలో పనిచేసే విహరిణులు (బ్రౌజర్) (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ఫాక్స్, సఫారి, గూగుల్ క్రోమ్ ) లో తెలుగు టైపు చేయడానికి బుక్ మార్క్ లెట్ [4] ద్వారా వాడుకునే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతిక అంశం పనిచేయడం ఆగిపోయింది. [5]
ఇటీవలి విడుదల
2019 మార్చి 28 న విడుదలైన క్రోమ్ విహరిణి ఎక్స్టెన్షన్ 52 భాషలకు పనిచేస్తుంది. [6]
ఇవీ చూడండి
వనరులు
- ↑ "గూగుల్ ఇన్పుట్ సాధనాలు -లిప్యంతరీకరణ". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
- ↑ "గూగుల్ లిప్యంతరీకరణ". Archived from the original on 2010-01-17. Retrieved 2010-08-28.
- ↑ "గూగుల్ లిప్యంతరీకరణ ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ (విండోస్ వాడుకరులకు)". Archived from the original on 2009-12-18. Retrieved 2010-09-08.
- ↑ "బుక్ మార్క్ లెట్ స్థాపన, వాడుటకు సహాయం". Archived from the original on 2010-08-22. Retrieved 2010-09-08.
- ↑ Brian Donohue. "Bookmarklets are Dead…". Retrieved 2019-09-04.
- ↑ "Google Input tools". 2019-03-28. Retrieved 2019-09-04.