"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గృహనామ సీసమాలిక

From tewiki
Revision as of 06:01, 22 March 2020 by imported>ChaduvariAWBNew (→‎అష్టావింశోత్తర శత క్షత్రియ రత్నమాల: AWB తో "మరియు" ల తొలగింపు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

గృహనామ సీసమాలిక అనగా గృహనామాలతో కూడిన సీస పద్యము. ఈ సీసమాలికలు ముఖ్యంగా వంశజుల పేర్లు, వారి వైభవం - విజయాలు, గోత్రాలు, గృహనామాలు కలిగియుంటాయి. ఆంధ్ర క్షత్రియులు (రాజులు) - వారి గృహనామాలను ఉద్దేశించి వివిధ కాలాల్లో సాహిత్యవేత్తలు, కవులు గృహనామ సీసమాలికలు రచించారు. ఈ సీసమాలికల్లో కొన్ని కర్నాటక రాజుల గోత్రములు, గోత్రాల ప్రకారం విభజనకు వీలుకాని గృహనామాలు, అనగా అజ్ఞాత గోత్రములు కూడా ఉన్నాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడైన శ్రీ బుద్ధరాజు వరహాలరాజు (1911-1978) వీటిని సేకరించి తన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరములో పొందుపరచారు.

వశిష్టగోత్ర క్షత్రియ గృహనామ సీసమాలిక

రచన: శ్రీ పూసపాటి రాచిరాజు (1446-1484), రచనా కాలము: క్రీస్తు శకం 1484

శ్రీకరం బయిరి వశిష్టగోత్రోద్భవుల్ సప్తారిషేయులు సార్వభౌము
లాధరాధీశవంశావతారాది ప్రశస్త వృత్తాంతంబు విస్తరింతు
అలఘవిక్రముడు కోసల జయదిత్యుడు దక్షిణవిజిగిష దాడి వెడలి
నిగామాగమాంత పారగుc డాజి భీష్ముండు అల దేవ వర్మ సైన్యాధిపతిగ
సఖిలసీమల విజయస్తంభములు నాటి దివి కేగెను; త్రిలింగదేశ భూమి
వాహినీపతి దేవ వర్మ ప్రభుండయ్యె; అడ్డూరి సీమలో నాజిc గొండ్రు
వల్లభు నోడించి వైభవంబుల మించి సార్వభౌమ పదంబు జగతిc గాంచె;
అతని సుతుండు బుద్దావనీశుcడు రాచ తపసి యై కాంచెను ధర్మనృపుని
తనయు లాతనికి బుద్ధయ దేవ వర్మలు బుద్ధరా జందుc బ్రసిద్ధుడయ్యె
అతని తనూజుc డాతతబలోన్నతుc డు మాధవ వర్మ నృపతి ముత్తాతc బోలి
జనకు నాజ్ఞను సప్తసుతి సాంగముగ రామదేశికుచే నుపదేశ మొంది
కనకదుర్గ కటాక్షప్రాప్తవిభవిభవు డై మళియసింగనిcబోరమ్రందcజేసె;
చబుబళ హత్తిమళ్ళ బలాధిపుని రక్తధారచే పరదేవతను భజించె;
వసుదిగింద్రియశకవత్సరంబుల జయవాటికాదుర్గవైభవము గాc చె;
గగనవాణీవాక్యగౌరవంబునc బూసపాటి భూమినిc బురీ వరముc గట్టి
వాసిcగాంచుట c బూసపాటివా రను నింటి పేరుc గాంచిరి; రాచ పెద్దలయిన
యమలరాజాధిగాc బ్రముఖుల మావారు తద్గృహనామములు c దాల్చుచుండ్రి
మామక వంశ భీమనృపాల సచివుండు దండనాధాగ్రణి దానరాజు
వేములవాడ శ్రీ భీమమనీషిచే గోపాల చరితంబు గొనినc మేటి;
వత్సవాయిని చంద్రవర్మచే గిరినిధి గగనేందుశకములc గాన్క నొంది
సజ్జాపురముcగొట్టి సకలారిమండల భయదప్రతాపంబుc బాదుకొలిపె;
వెలసి నా వంశజు లిలా వత్సవాయివారైరి - కాకర్ల మూ డనెడి వీట
సయ్యపరాజేంద్రు నాజ్ఞానువర్తియై కసువనృపాలుండు కార్యదక్షుc
డై మించె నింద్రు బృహస్పతిపోలిక నా వంశగృహనామ మయ్యె నదియు
సాగి రామావనీశ్వరు చతురోక్తుల కలరి యయ్యనృపాలుc డాదరమున
నిజమంత్రిగాc జేసి బెజవాడ పరగణాయచ్చెర్లసా గనునట్టి వీట
రాదుర్గ మొకటి నిర్మాణంబుc గావించి యాతని కొసc గె దయాషరతను
నాటc గోలెను దగె నా గృహనామంబు సాగివారని - మరి సచివరులు,
దండనాధులును, బాంధవులు, సామంతులు, ఫౌజుదారులు, పోటుబంటుమాను
లయిన తద్గోత్రజుల్ - అల్లూరి వేంకటరాజు, సయ్యపరాజు రామరాజు,
మంతిన గుఱ్రాజు , కంతేటి పెదరాజిరాజును, బాల్రాజు రామరాజు
సిరుగూరి గుఱ్రాజు, చేకూరి దేవనృపాలుండు, కుచ్చర్లపాటి తమ్మి
రాజాగ్రణియు, భయిఱ్రాజు భయఱ్రాజు, పేరిచర్లక్క భూవిభుc డు, పెమ్మ
రాజు వీరపరాజు, రావిపాటన్నపృధ్వీ భర్త సరిపల్లె తిమ్మరాజు,
వేగేశనయ్యపృధ్వీనాథుడు+అడ్డూరి శ్రీరంగరాజును, చెరుకువాడ
కోననృపాలుడు, కూసమపూడి బయ్యపరాజు, కోసూరి యమలరాజు,
నందేల కృష్ణబూనాథుండు, ధేనువకొండ+అధిపుడు పెద్దగోపరాజు,
వేజెళ్ళ (సామాంతరాజు బంధుజనాళి నవపద్మవనహేళి) నంబిరాజు,
అయినముపూడి రంగావనీనాధుండు, పొత్తూరి తిరుమల బుక్కరాజు,
కూనపరాజు (సుగుణరాశి) మల్రాజు, దెందుకూరు+అయ్యలదేవరాజు,
వెలగనాటి (+అహవవిజయుండు) సఱ్రాజు, ములగపాటి పెద్దబుద్దరాజు,
వాడపల్లి కృష్ణవసుమతీనాధుడు, ఇందుకూరు+అచ్చిరాజేంద్రవిభుcడు,
సామంతపూడి కృష్ణమరాజు, సఖినేటి తిరుమల వెంకట వరదరాజు,
గురజాలవిజయాంక కోదండరామరాజు+ అద్దెపల్లి (+ఈశుండు) పెద్దిరాజు,
కొలుకులూరు+అన్ననృకుంజరుండు+ అడ్డాల గోవిందరాజును, గోకరాజు
కసువనృపాలుc డు, గాదిరాజు+అన్నపరాజు, ఇసుకపల్లి రామరాజు,
రుద్రరాజు రామభద్రనృపాలుc డు, నడిమిపల్లి జగన్నాధరాజు,
వలివర్తి జగ్గనృపాలుc డు వేగిరాజు+ అత్యుతరామరాజప్రభుండు
బుద్ధరాజు కొండభూపతి, గణపతిరాజు గొంకరాజు రాజ రాజు,
గోరింట పెద్దకుమారరాజాగ్రణి, పిన్నమరాజు పృధ్వీవరుండు
ఆదిగా నేcబదియాఱు కుటుంబముల్ కొమరొందెను వశిష్ట గోత్రమునకు
వసుమతీ భారధూర్వహు లాశ్రితావనుల్ కలనైన బొంకెఱుంగని సుకృతులు
అదరుగుండెయుc బిక్కబెదరులేని బలాఢ్యు లాహవార్జునులు విద్యాధికారు
లెన్నడు వైరికి వెన్నీని శూరులు దైవభూవరభక్తిc దనరువారు
శమదమాదిసుగుణసంపత్తి గలవారు శరణాగతత్రాణబిరుదువారు
అనుచు శ్రీరామచంద్రార్పణముగ ఋతుగగనాబ్ధిచంద్రశకంబునందు

గీ|| సరససంగీత సాహిత్య చక్రవర్తి రాజమార్తాండ శ్రీ తమ్మిరాజరాజ
రాచిరాజోదితంబు విభ్రాజితంబు ధరణి వెలయుత నాచంద్రతారకముగ

అష్టావింశోత్తర శత క్షత్రియ రత్నమాల

రచన: శ్రీమాన్ పరవస్తు వేంకట రంగాచార్యులయ్య, రచనా కాలము: క్రీస్తు శకము 1883

సీ|| శ్రీమన్మహాపరిచ్చేదక వర్ణాట కోట కాకతివంశపాటవముల
వాసిష్ట, కౌండిన్య, వర ధనంజయ కాశ్యపాఖ్య గోత్రంబుల నతిశయిల్లు
మహనీయ చారిత్రమహిమవిక్రము లైన వరపూసపాటి సత్+వత్సవాయి
కలిదిండి దాట్ల కాకర్లపూడి పులిశి పెనుమెత్స వేజళ్ళ పేరిచర్ల
పాకలపాటి భూపతిరాజు వలివర్తి మంతెన అల్లూరి మందపాటి
గొట్టెముక్కల సాగి గోరింట కొప్పెర్ల చింతలపాటియు దంతులూరి
సాగిరాజుద్వయ జంపన జంపెన ముదునూరియు మృదుండి ములగపాటి
అడ్డాల పొత్తూరి అడ్డూరి చేకూరి శేకూరి చెరుకూరి చెరుకువాడ
చోడ్రాజు గండ్రాజు జుజ్జూరి చిట్రాజు కొండూరి కంతేటి కొత్తపల్లి
నల్లపరాజు కూనపరాజు ఉప్పలపాటి బెల్లముకొండ పత్సమట్ల
గూడూరి నంబూరి గుంటూరి సరిపెల్ల కొవ్వూరి చిరువూరి కొలుకులూరి
పెమ్మరాజు కఠారి బెజవాడ బాల్రాజు భైఱ్రాజు భేతాళ పాతపాటి
గొడవర్తి అబ్బరాజ్ గురజాల కమ్మెల సకినేటి చంపాటి లకమరాజు
ఇందుకూర్ ఈమని దెందుకూర్ మద్దాల వేములవాడయు వేగిరాజు
ఏటికూర్ నందేల ఈదరపల్లియు కోసూరి కనుమూరి కొలనువాడ
రావిపాడ్ గణపతిరాజు అయినముపూడి ఉయ్యూరి వీపూరి ఓరుగంటి
సామంతపూడి కూసుమపూడియును ధేనువకొండ ముమ్మపరాజు గోకరాజు
గరికపాటియు చల్లగళ్ళ వేగీశన వాడపల్లియు నున్న వడ్లమూడి
కొక్కెర్లపాటియు కుచ్చర్లపాటియు వేటికూరియు మరి తోటకూరు
తిరుమలరాజున్+ అద్దేపల్లియు కునంతరాజును, గాదిరాజుయుగము
రుద్రరాజుద్వయారూఢి పిన్నమరాజ్ బుద్ధరాజ్+ఉద్దరాజ్ బొమ్మడా
చామర్తి దైవనాల్ సంయపరాజును అంగరాజ్ కంకిపాడు+అమలరాజు
వానపాల ఇసుకపల్లి ఇమ్మలరాజు దోసపాటి దండు దుర్గరాజు
కళ్ళెపల్లియు నడింపల్లి వెలగలేటి పోచిరాజు+అనగను బొల్పుమీఱు

గీ|| అష్టవింశోత్తర శతాహ్వయములవారి ధాత్రిలోపల నాచంద్రతారకముగ
భద్రగిరిధాముడగు రామభద్రుడెపుడు పూర్ణ కరుణార్ధ్రదృష్టితోc బ్రోచుగాత.

ఆంధ్ర క్షత్రియ గృహనామ సీసమాలిక

రచన: శ్రీమాన్ పరవస్తు వేంకట రంగాచార్యులయ్య, రచనా కాలము: క్రీస్తు శకము 1883

సీ|| శ్రీవయోధర సరసీజమిళద్భృంగ కరసంగతరథాంగ ఖగతురంగ
రమణీయమౌ త్రిలింగమహీతలములోని క్షత్రియగోత్రముల్ సవరి వారి
గృహనామములను సాంగీకారభంగిగా సీసమాలిక జేత్తు చిత్తగింపు
మందు వశిష్ట కశ్యప ధనంజయ భరద్వాజ కౌండిన్య గోత్రంబులైదు
ప్రవిమలకీర్తి సాంధ్రము పూసపాటి సంజ్ఞము వత్సవాయ కాకర్లపూడి
సాగి మంతెన గురిజాల నడిమిపల్లి గణపతిరాజును గాదిరాజు
సాగిరాజు+అడ్డూరి వేగేశనయు రుద్రగాజు చోడ్రాజు బుద్ధ్రాజు చెఱకు
వాడ పిన్నమరాజు వాడపల్లియు చిరువూరి బైఱ్రాజు+ఇందుకూరి యిసుక
పల్లి ధేనువకొండ బాలరాజు+అల్లూరి పొత్తూరి సామంతపూడి పేరి
చర్ల కొలుకులూరి చేకూరి బెజవాడ సఖినేటి కోసూరి చల్లగండ్ల
వలివర్తి యను గొడవర్తి యిమ్మనరాజు రావిపాటి కునాధరాజు వేటు
కూరి ములగపాటి కుచ్చర్లపాటియు వేజర్ల సయ్యపరాజు దెందు
కూరి+అంగరాజును కొమరొప్పుచుండును ధారిత్రిపై వాసిష్టగోత్రమునకు
నలువదియారు సంతతులు; కౌండిన్య గోత్రమ్మున సంతతుల్ తొమ్మిది కలి
దిండి చిట్రాజు ్ +అద్దేపల్లి ముదునూరి సరిపల్లి వర్నాటజంపనయును
వేములమందయు చేమర్తి యయినమపూడి నా విశృతముబులు ధరిత్రి;
ధనంజయాఖ్య సంతతి కోటజంపన దాట్ల నల్లపరాజు దంతులూరి
పాకలపాటి భూపతిరాజు చింతలపాటియు కొక్కెర్లపాటి కంకి
పాటియు పెన్మెత్స తోటకూరియు రుద్రరాజు కమ్మెల సాగిరాజు గాది
రాజును తిరుమలరాజును చెరుకూరి పచ్చమట్లయును చంపాటి దండు
కొండూరి కొవ్వూరి గొట్టెముక్కలయును వీపూరి కొప్పెర్ల వేగిరాజు
గుంటూరి మద్దాల కొత్తపల్లియును చేకూరి కళ్ళేపల్లి కొలనువాడ
కూసవపూడియు దోసపాటియు వేటుకూరి జుజ్జూరియు గోకరాజున్
ఉద్దరాజు+అడ్డాలయును ముదుండియు వానపాల భైఱ్రాజు భేతాళ నున్న
వడ్లమూర్గూడూరు వరుసతో కంతేటివారను పేళ్ళచే వసుధనొప్పు
నెన్నగా నలువదియేడు; కాశ్యపగోత్ర భవములు పదిరెండు పరగు మంద
పాటి గోరింట యుప్పలపాటి సయ్యపరాజు నంబూరి గండ్రాజు పాత
పాటియు నీదరపల్లి కఠారి బెల్లముకొండ కనుమూరి లకమరాజు
నన నొప్పుచుండును; నజ్ఞాతగోత్రోద్భవంబులు పదియైదు వసుధలోన
వీననరాజును దైవనాలయు వోరుగంటియు నుయ్యూరి గరికపాటి
పెమ్మరాజులునియు మమ్మనరాజును పోచిరాజును వడ్లమూడి బొమ్మి
డాల్+అబ్బిరాజు వెలగలేటి దుర్గరా జమలరాజను వేళ్ళ నమరుచుండు;

గీ|| నల భరద్వాజ గోత్రనృపాన్వయములు గానమిప్పుడు పెరనాల్గు ఘనత జెందు
రహి పరిచ్చేదకు వర్నాట కోట కాకతులు నన్ను సంజ్ఞల క్రమము వీరు [1]

క్షత్రియాన్వయ మంజూష

రచన: శ్రీ దువ్వూరి జగన్నాధ శర్మ, రచనా కలము: క్రీస్తు శకము 1933

సీ|| శ్రీలc జెలంగు గోరింటయు ఉప్పలపాటి బెల్లంకొండ పాతపాటి
కనుమూరి నంబూరి గండ్రాజు లకమరాజ్ దెందుకూరి కఠారి మందపాటి
ఈదలపల్లియు ఈవూరు సంయపరాజు+అనంగ నుపాఖ్యరాజులెల్ల
పదునాల్గు గృహములవారలు కాశ్యపగోత్రాభివాదన ్ గూర్చువారు
కాకతిఖ్యాత సత్ క్షత్రియు లోరుగల్ పాలకుల్ శశివంశభవులు వీరు;
పోచిరాజు పులిశి బొమ్మిడాల+అమలరాజ్ ఉయ్యూరు దుర్గరాజు+ఓరుగంటి
అబ్బనాలయు దైవనాల గరికిపాటి నాగ నీ దశకంబునష్టగోత్రు
లైకలంబున కందారకమనెడు, నిట్టు లిc కc గొందఱుcడు టూహింతు, "గోత్ర
నా శే తు కాశ్యప" నాగ బెద్దలనుడి, గాc గc గాశ్యపగణపతులు వీరు;
జంపెన చిట్రాజు సరిపల్లె చేమర్తి అయినముపూడియు అద్దెపల్లి
ముద్దునూర్+అల్ల వేములకొండ కలిదిండి యనగc దొమ్మిదియిండ్ల యవనిపతులు
వేంగి రాజ్యాధీశ విభవులై వర్ణాటి కౌండిన్య గోత్ర విఖ్యాతి గనిరి;
ధరణాలకోట భూతలపతులు ధనంజయార్షేయ గోత్రజు లధికమతులు
గుంటూరి గూడూరి గొట్టెముక్కల దండు జంపన జుజ్జూరు సాగిరాజు
వేటికూరు+అడ్డాల తోటకూరును నున్న బైఱ్రాజు భేతాళ పచ్చమట్ల
వేగిరాజు మృదుండి పెనుమత్స పాకలపాటి భూపతిరాజు వానపాల
చేకూరి చెంపాటి చింతలపాటి వీపూరి కొండూరి కొవ్వూరి దాట్ల
కమ్మెల కొప్పెర్ల కంతేటి కొక్కెర్లపాటి కూసమపూడి వడ్లమూడి
గోకరాజును చెరుకూరి నల్లపరాజు మద్దాల రుద్రరాజు+ఉద్దరాజు
కంకిపాడ్ దంతులూర్ గాదిరాజును కొత్తపల్లి దోసపాటియు కొలనువాటి
వరలు కళ్ళేపల్లి తిరుమలరాజును నాగ నల్బదియేడు నామములు, రి
పుంజయుల్వీరు ధనంజయ సద్గోత్ర మభివదించి పవిత్రులగుచునుంద్రు;
షట్సహస్రావనీ సామ్రాజ్యపతులు వసిష్టగోత్రులు, పరిచ్చేదినృపులు
అల్లూరి గాదిరాజు+అడ్డాల కంతేటి సామంతపూడి కుచ్చర్లపాటి
పొత్తూరి కాకర్లపూడి అయినముపూడి కోసూరి చేకూరి గోకరాజు
వత్సవాయి చెరుకువాడ దీనంకొండ భైర్రాజు చోడ్రాజు వాడపల్లి
వేగిరాజు+అడ్డూరు వేటుకూరు+అంగరాజ్ ఇందుకూర్ గురజాల యిమిడిరాజు
వేజెళ్ళ సంయపరాజు కునంతరాట్ నందెల మంతెన దెందుకూరు
సరిపల్లి సకినేటి సాగి వేగేశన వెలగనాడ్ గోరింట ములగపాటి
కూసమపూడి గొడవర్తి గణపతిరాజు నడిమిపల్లి రావిపాటి
బాలరాజున్+ అద్దేపల్లి పిన్నమరాజు పేరిచర్ల వలివర్తి పెమ్మరాజు
చిలుకూరి బుద్దరాజ్ కొలకలూరు ్ ఇసుకపల్లి రుద్రరాజు చల్లగళ్ళ
పూసపాటి యనంగc బొలుపొందు నేc బదియాఱిళ్ళవారు దైవాభిరతులు,
నందనీయుడు పూసపాటి తమ్మికుమార రమణరాజాగ్రణి రాచిరాజు
సంగీతసాహిత్యచతురుండు తొలి ఋతు గగనాబ్ది చంద్రశకంబునాcడు
అనె నిట్టు "లేc బదియాఱు కుటుంబముల్ కొమరొందెను వసిష్టగోత్రనను..."
ఏతాదృశ వసిష్టు లెన్నికలోనాcడు నాట నాఱ్రిండ్లుగా లోటుపడియె
నేను సత్ క్షత్రియ శ్రేణిలో దిరుగాడి యేc బదాఱిc టికిc బూరించినాడ
ఉభయనామంబులనుండె వాడుక తొల్లి క్రింది పేరుల రాజబృందమందు
బెజవాడ తమటెంకి విడిచివచ్చుట బెజవాడవా రల పూసపాటివారు;
వెలసె నీ యుపనామములు వారివారికి నిది యది వాడుక వరలునిపుడు.
వేగిరాజు+అడ్డాల వేటికూరు+ఈపూరు కంతేటి గోరింట గాదిరాజు
సరిపల్లి చేకూరు సంయపరాజ్ + అద్దేపల్లి జంపెన దెందుకూరు
గోకరాజ్ బైర్రాజు కూసమపూడి ఐనమపూడి రుద్రరాజ్ నామములను
పదునెనిమిది ఇండ్లవారలు గోత్రద్వయారూఢి గల రాజవారు జగతి.
ధాన్యవర్షఖ్యాతిc దనరు కటకమందుc జెన్నారె నల హరిసీమకృష్ణుc
డతని వంశజులు చంద్రాన్వయులు, ధనంజయసగోత్రులై నట్టి యవనిపతులు;
సోమదేవాన్వయుల్ సోమకులాంబోధి చంద్ర మాధవవర్మ సంతువారు
కాశ్యపగోత్రికగణమువారగు రాజపుత్రులు సుచరితుల్ భూరియశులు;
వర్ణాటి భూపతుల్ భల్లాణ సింహాసనాధీశ కీర్తి చెన్నారినారు
కొల్లాపురస్థాన వల్లభుల్ కౌండిన్యు లా రవివంశవిస్తారకరులు;
ఏఱువనా డు పాలించె పరిచ్చేదియైన సూర్యకులుండు మానఘనుండు
భీమరాజతనికిc బెద్ద మాధవవర్మ దేవవర్మ కళింగదేశవిభుడు
వారి సంతతివారు బహుళశాఖలవారు వాసిష్టులయిరి భూపాలపరులు.
చంద్రసూర్యాన్వయశాఖల గృహసంఖ్య నూటముప్పదియాఱు నేటిగణన
నయనగుణాచంద్రసమాకహూణవత్సరయుతాంగీరన శ్రావణమున
చరిత్రకాంశప్రశస్తి నలరు దీవి సింహాచలాధీశ సేవనుండి
రచియించి రాజపుత్ర సహస్రమండలి కొడగూర్చి యానందమొందినాడ

గీ|| బుధవినుతకీర్తి పేటి శ్రీ పూసపాటి రాజమార్తాండ డెంకాడరమణ మాన
సాంధ్రవిభవ! సీతారామచంద్రబాల! సూర్యనారాయణనృపాల! సూక్తిజాల!

ఆంధ్ర క్షత్రియ గృహనామ సీసమాలిక

రచన: కొండూరి చిన్నమరాజు, రచనా కాలము: క్రీస్తు శకం ?

సీ|| శ్రీరామపదభక్తి సిద్ధంబుగాన వారికిc జేసెద వందనములు
గుణ ధురంధరు డల కొండూరి కొండరాజమలాత్ముc డతని ప్రియాత్మజు cడను
నన్ను బిల్తురు జనుల్ చిన్నమరాజని మహిమీద జనులు సన్మార్గుడనగ
జగ్గరాడ్ గురుకటాక్షంబున జెప్పితి క్షత్రియుల కుటీరవరసనామ
ములు భాసమానమై పొలుపొంద నిలమీద వర సీసమాలిక వన్నెమీఱు;
పౌరుషయుక్తులు భవ్యచారిత్రులు భూరిగుణోత్తముల్ పూసపాటి,
వత్సవాయి, చెరుకువాడ, నల్లపరాజు, కల్దిండి, సాగి, కాకర్లపూడి,
గొట్టెముక్కల, దాట్ల, కొండూరి, వేజళ్ళ, వలివర్తి, చెరుకూరి, వానపాల,
గణపతిరాజు, పాకలపాటి, లంకరాజ్, మంతెన, అల్లూరి, మందపాటి,
బుద్దరాజు+ఈమని, భూపతిరాజు, చింతలపాటి, పెన్మెత్స, దంతులూరి,
బెజవాడ, బాలరాజ్, పెరాజు, పులిసి, జంపన, జంపెన, సాగిరాజు,
సాగిరాజ్, కమ్మెల, సరిపల్లి, అడ్డూరు, కనుమూరి, కొప్పెర్ల, గాదిరాజు,
గాదిరాజు, కఠారి, గండ్రాజు, గూడూరి, నంబూరి, చేమర్తి, నడిమిపల్లి,
కోసూరి, నుద్దాల, కొవ్వూరి, చిలువూరి, గోరింట, నంద్యాల, కొలుకులూరి,
ఏటికూ రేటికూ ర్దెనుదూరు+అంగరాజు+అడ్డాల, అమలరాజు,
ఉప్పలపాటి మృదుండి, ఉద్దరాజు, గరికిపాటి, బల్లంకొండ, పచ్చమట్ల,
ములగపాట్, భేతాళ, ముదునూరి, యీదులపల్లి, రుద్రరాజు, పాతపాటి,
నున్న, కూనపరాజు, పిన్నమరాజ్, దండు, కొల్నాటి, కంతేటి, గోకరాజు,
చిట్రాజు, జుజ్జూరు, చేకూరు, చేకూరి, పొత్తూరి, చోడ్రాజు, కొత్తపల్లి,
గుంటూరు, వీపూరి, గొడవర్తి, పెరిచర్ల, తిరుమలరాజు, కుచ్చెర్లపాటి,
అయినమపూడి, సంయపరాజు, బైఱ్రాజు, చెంపాటి, సఖినేటి, చెర్లబంద,
అద్దెపల్లె+ఏగిశన+అబ్బరాజు, కుణంతరాజు, దీనంకొండ, రావిపాటి,
సామంతపూడి, కూసంపూడి, వాడపల్, వేములబందయు, వెలగనాటి,
కొక్కెర్లపాట్, తోటకూర, యిమ్ముడిరాజు, కళ్ళెపల్, వేగిరాజ్, కంకిపాటి,
పోచిరాజును, రుద్రభూప, గుర్జాల్, వడ్లమూడి, సుకపల్లి, ఓరుగంటి,

గీ|| కాశ్యప ధనంజయ వసిష్ట గణములవారు నలరు కౌండిన్య గణములవారగు నృపాల
కాలయంబుల నామంబు లవనియందు నూటయిరువది రెండయి వెలసె.

ఇందులో ప్రస్తుతము 13 ఇంటిపేర్లు తీరంధ్ర దేశములో లేవు. కర్నాటక రాష్ట్రానికి చెందిన దత్త మండలములో ఉన్నవి.

శ్రీమదుత్తమాంధ్ర క్షత్రియ గృహనామ సీసమాలిక

రచన - పొత్తూరి శ్రీరామరాజు (హఠయోగి) ; రచనా కాలము - 1950

సీ|| శ్రీక్షత్రియాహ్వయ క్షీరార్ణవంబునం దాదిత్యవంశోద్భవంబులైన
స్థిర వసిష్టసగోత్ర వరధనంజయ కాశ్యపసగోత్ర కౌండిన్యయు సుభరద్వ
జసగోత్ర పంచకం బసమానమగు నందు రసవంతమై పూర్వరచితమైన
వరపూసపాటి సద్వత్సవాయ్ కల్దిండి కాకర్లపూడియు కంకిపాటి
కంతేటి గొడవర్తి కనుమూరి కోసూరి పొత్తూరి మంతెన పోచిరాజు
అల్లూరి జంపెన అడ్డూరి నంద్యాల గుంటూరి గురజాల కొలనువాడ
అడ్డాడిసుకపల్లి యబ్బిరాట్చిట్రాజు చెంపాటి చెరుకూరి చెరుకువాడ
కమ్మిల గూడూరి బొమ్మిడా లంగర దండు నందెలపల్లి దంతులూరి
కుచ్చర్లపాటి పెన్మెత్స కళ్ళేపల్లి ఈదరపల్లి కునాధరాజు
కొండూరి చిలుకూరి కొప్పెర్ల చేకూరి పంతపాటి కఠారి పట్సమట్ల
ధేనువకొండ ఈవనరాజు వలివర్తి కుచ్చర్లకోట కొక్కెర్లపాటి
రావిపాట్నల్లపరాజు నారదపల్లి దెందుకూ రుయ్యూరి మందపాటి
బుద్ధరా జంగరాజద్దెపల్చింతలపాటి సయ్యపరాజు పాతపాటి
లఘుమరాజున్ దుర్గరాజు రుద్రరాజు వేజళ్ళపాకపాడ్వేముపాటి
భూపతిరాజు నంబూరి వేములమంద ఈడుమూడిందుకూర్బోదరాజు
గణపతిరాజు మమ్మనరాజు భైర్రాజు వేగేశినోర్గంటి వేగిరాజు
తిరుమలరాట్తోటకూరి కూచంపూడి పిన్నమరాజును పేరిచర్ల
మద్దాల ముదునూరి మల్లపరాజును యులిసి గోరింటయు ములగపాటి
ఉప్పలపాటి కూనపరాజు ముద్దుండి కొవ్వూరి దోసపాట్కొత్తపల్లి
నడిమిపల్గాదిరాట్వాడపల్లుద్దరాట్చేమర్తి జంపన చెల్లగళ్ళ
గొట్టెముక్కల సాగి గోకరాద్బెజవాడ సామంతపూడియు సాగిరాజు
దాట్ల బెల్లంకొండ దైనాల ము రాజు కొల్నాటి వెలగలే ట్కొలుకులూరి
సఖినేటి బాల్రాజు సరిపల్లి వేట్కూరి యంకిపా ట్శిరువూరి ఈమలరాజు
బ్రహ్మరాజు యవన భేతాళ జుజ్జూరి గండ్రాజు చోడ్రాజు గరికపాటి
ఈటికూ ర్పాకలపాటి యైనంపూడి వానపా ల్వీపూరి వడ్లమూడి
యన నూటముప్పదియాఱు పేర్లను గ్రామపౌరషంబులు ముఖ్యపురుషములన
త్రివిధంబులగువాని వివరించి శ్రీ పోలవర దివ్య పొత్తూరి వంశ జనితు

గీ|| డైస శ్రీరామరాజా ఖ్యు డాంధ్రదేశవాసులౌక్షత్రియోత్తముల్ జూచి మెచ్చ
సీసమాలిక శ్రద్ధతోc జేసె నిట్లునుగుణధనులార! జనులార! చూడరయ్య!

సీసమాలికలో కొన్ని దోషములున్నాయి. ఆంధ్ర క్షత్రియులలో అన్ని గోత్రములవారు ఆదిత్యవంశోద్భవులు కారు. గణములను నప్పించుటకై కూర్చిన సంధులవలన గృహనామాల్లో కొన్నిచోట్ల వికృతరూపాలు ఏర్పడ్డాయి, లేని గృహనామాలు పట్టికలో చేర్చబడ్డాయి.

శ్రీమద్దక్షిణాంధ్రోత్తమ క్షత్రియ గృహనామ సీసమాలిక

రచన - పొత్తూరి శ్రీరామరాజు (హఠయోగి) ; రచనా కాలము - 1950

సీ|| శ్రీ విష్ణు నిలయ మౌ శ్రీ విల్లిపుత్తూరు క్షేత్రంబునకు పశ్చిమోత్తరమున
రవ్యతరంబైన రాజపాళయములో కాపురంబున్న శ్రీకరులు క్షత్రి
యులు వసిష్టసగోత్రజులును సత్కౌండిన్యగోత్ర ధనంజయగోత్ర కాశ్య
పసగోత్రజులు గాగ బరగి రవ్వారిలో వర పూసపాటి చేకూరి సాగి
గొట్టుముక్కల యెఱ్రగుంటలన్ (యోర్గంటి) మంతెన బెజవాడ మందపాటి
వత్సవాయ్ చోడ్రాజు వలివర్తి పెన్మెత్స వేగేశిన ముదుండి వెలగలేటి
చింతలపాటి పేర్చెర్ల పాకలపాటి దంతులూర్ జుజ్జూరి దాట్ల యిందు
కూరి నంబూరి కోసూరియు ముదునూరి నంద్యాల కొండూరి నాగ సప్త
వింశతి గృహనామ వివరంబులవనిపై నాంధ్రదేశనివాసు లభినుతించc

గీ|| దగిన సుజ్ఞాన యుతులైన దక్షిణాంధ్ర క్షత్రియుల వంశ దివ్యచారిత్రమరసి
రాజయోగీంద్రులిటు చెప్పి రాదరమున సుగుణధనులార! జనులార! చూడరయ్య!

మూలాలు

  1. ఆంధ్ర రాష్ట్ర పత్రిక, ది-2-2- 1927, శ్రీ శ్రీ శ్రీ కవిరాజ వత్సవాయ వెంకటనీలాద్రి రాజు

ఇంకా చదవండి