చట్టం

From tewiki
Jump to navigation Jump to search
దేశ అధికారాన్ని సూచించే కత్తితో, న్యాయం నిష్పాక్షికంగా ఉండాలని సూచించే కళ్ళకు గంతలతో న్యాయదేవత విగ్రహం

చట్టం అనేది సమాజం యొక్క శాంతి భద్రతలను కాపాడుకోవటానికి ఉద్దేశించి ఒక నిర్దిష్ట దేశం నిర్ణయించిన నియమాల సమితి. న్యాయస్థానాలు లేదా పోలీసులు ఈ నియమ నిబంధనలను అమలు చేయవచ్చు, జరిమానా విధించడం, జైలు శిక్ష వేయడం వంటి వాటి ద్వారా చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను శిక్షించవచ్చు. పురాతన సమాజాలలో, ప్రజలు ఎలా జీవించాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఏలా వ్యాపారం చేసుకోవాలి, ఒకరితో ఒకరు ఎలా మసలుకోవాలి అనే దానిపై నియమాలను రూపొందించి నాయకులు చట్టాలు రాశారు. చరిత్రలో చాలా సార్లు సమాజం యొక్క వ్యయంతో కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చడానికి చట్టాలు తప్పుడు ప్రాతిపదికగా ఉన్నప్పుడు అవి సంఘర్షణకు దారితీశాయి. దీనిని నివారించడానికి, నేడు చాలా దేశాలలో, ప్రజలచే ఎన్నుకోబడ పార్లమెంటు లేదా శాసనసభలోని రాజకీయ నాయకుల సమూహాలచే చట్టాలు వ్రాయబడి ఓటింగ్ విధానం ద్వారా అమోదం పొందుతున్నాయి. నేడు దేశాలు సమాజం యొక్క మొత్తం చట్రానికి రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాయి, అవసరమయితే మరిన్ని కొత్త చట్టాలను తయారు చేసుకుంటున్నాయి. సమాజంలోని సభ్యులు సాధారణంగా వారు ఎంచుకునే అన్ని చట్టపరమైన విషయాలలో తగినంత స్వేచ్ఛను కలిగి ఉంటారు. చట్టాలను ఉల్లంఘించడం లేదా చట్టాలను పాటించకపోవడం చట్టవిరుద్ధం. లీగల్ కోడ్ అనేది అమలు చేయబడిన చట్టాల వ్రాతపూర్వక కోడ్. ఇది పోలీసులు, కోర్టులు శిక్షలు వంటి వాటితో వ్యవహరించవచ్చు. న్యాయవాది న్యాయ నియమాలను అధ్యయనం చేసి వాదించే ఒక వృత్తినిపుణుడు.