"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చేతిరాత

From tewiki
Revision as of 11:18, 6 February 2021 by Rajyalakshmiindicwiki.in (talk | contribs) (శీర్షిక, ఉపశీర్షిక)
Jump to navigation Jump to search

పరీక్షలో చేతిరాతకే మార్కలు!

మనం ఎంత బాగా చదివినా పరీక్ష రాసే ఆ మూడు గంటల సమయం కీలకమైంది. ఏం రాస్తున్నాం. ఎలా రాస్తున్నాం. ఎంత రాస్తున్నామన్నది చాలా ముఖ్యం. అందుకే పరీక్షలో ఎలా రాయాలి. ఎలా రాయకూడదన్నది తెలుసుకుందాం.

చేయకూడనివి

 • ఎవరైనా సరే చక్కగా ఉన్న చేతిరాతనే ఇష్టపడతారు. అందుకే పరీక్ష పేపర్లను దిద్దేవారు చేతిరాత అందంగా ఉన్నవారి జవాబులకి ఒక మార్కు ఎక్కువ వేస్తే, గజిబిజిగా కొట్టివేతలతో ఉన్నవారికి ఒక మార్కు తక్కువ వేసే అవకాశముంది. కాబట్టి వీలైనంతమేరకు కొట్టివేతలు, దిద్దులు లేకుండా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
 • ఒక్కోసారి పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ జవాబులు సరిగ్గానే రాశామనుకుంటాం. తీరా పేపర్ పైన ప్రజెంట్ చేయాల్సి వచ్చేసరికి విఫలమవుతాం. దీనివల్ల మార్కులు తక్కువగానో, లేదంటే పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
 • అక్షరాల సైజు కూడా ముఖ్యమే. పెద్దసైజు అక్షరాలు రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకనీ అక్షరాల పరిమాణం మరీ చిన్నవిగా కాకుండా, మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి.
 • జవాబు పేపర్లమీద పెన్నుని ఎక్కువ ఒత్తిపెట్టి రాస్తూంటారు కొందరూ. అలా రాయడం వల్ల ఆ అక్షరముద్రలు వెనుకవైపు కూడా పడతాయి. దీంతో తిరిగి రాయడం ఇబ్బందే, పైగా పేపరు చూడటానికి బాగుండదు.
 • సమయం మించిపోతుందనే భావనతో, వేగంగా రాసేస్తుంటాం ఒక్కోసారి. అలా గబగబా రాయడం వల్ల, అక్షరాల అందం మారిపోతుంది.
 • ఎగ్జామ్ హాల్లో కొంతమంది తలని మరీ కిందకి ఒంచేస్తుంటారు. దీనివల్ల మెడ, వెన్నునొప్పి రావడమేకాక, ఎక్కువసేపు రాసే శక్తిని కోల్పోతారు.

చేయాల్సినవి

 • పెన్సిల్ లేదా పెన్నుని పట్టుకునేందుకు వీలుగా, తక్కువ బరువుతో ఉండేలా చూసుకోవాలి.
 • ఏ పెన్సిల్ లేదా పెన్నునైతే ప్రాక్టీస్ లో (పరీక్షముందు వరకు) వాడతారో, దాన్నే పరీక్షలో కూడా ఉపయోగించాలి. పరీక్ష కదా అని కొత్తరకం పెన్ను, పెన్సిల్ ను వాడితే ఆ సమయంలో ఇబ్బందికరంగా మారవచ్చు.
 • చేతివేళ్ల మీద ఒత్తిడి పడేలా పెన్నును పట్టుకోకూడదు. అలా చేస్తే వేళ్లు నొప్పి పుట్టి మిగతావి రాయలేకపోవచ్చు.
 • పరీక్ష రాసేటప్పుడు బెంచీలో నిటారుగా, సౌకర్యవంతంగా కూర్చోవాలి.
 • ప్రాక్టీస్ కోసం సింగిల్ రూల్ లేదా డబుల్ రూల్ నోట్ బుక్ నే ఎంచుకోవాలి. నేరుగా తెల్ల పేపర్ల మీద రాయకూడదు. దీనివల్ల వాక్యాలన్నీ కిందకి, పైకి వెళ్లిపోయి సరైన క్రమం అనేది అలవాటు కాదు.
 • ముందుగా అక్షరమాలని సాధన చేయాలి. తరువాత పదాల్ని, వాక్యాల్ని చివరికి పేరాల చొప్పున రాస్తూ వేగాన్ని పెంచుకోవాలి.
 • రాసే వేగాన్ని రాతని రెండింటిని సమతుల్యం చేసుకోవాలి.
 • నేరుగా పరీక్ష రోజు 3 గంటలసేపూ రాయాలంటే కష్టమే! సాధనలో భాగంగా రోజుకి 2 నుంచి 2.30 గంటలమేర రాయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
 • సాధనలో భాగంగా ఒకదాంట్లో నుంచి ఇంకోదాంట్లోకి కాపీ, పేస్ట్ లా చూస్తూ రాయకుండా, సొంతంగా ఒక విషయంపైన చూడకుండా రాయగలగాలి. అప్పుడే పకశక్తి సామర్థ్యం తెలుస్తాయి.

మూలాలు