జంప్ జిలాని

From tewiki
Jump to navigation Jump to search
జంప్ జిలాని
దస్త్రం:Jump Jilani Move Poster.jpg
జంప్ జిలాని సినిమా పోస్టర్
దర్శకత్వంఇ. సత్తిబాబు
నిర్మాతఅంబికా కృష్ణ
రచనసుందర్ .సి
నటులుఅల్లరి నరేష్
ఇషా చావ్లా
స్వాతి దీక్షిత్
సంగీతంవిజయ్ ఎబినేజర్
ఛాయాగ్రహణందాశరథి సివేంద్ర
నిర్మాణ సంస్థ
వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్
విడుదల
2014 జూన్ 13 (2014-06-13)
నిడివి
164 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జంప్ జిలాని 2014 జూన్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మాణ సారథ్యంలో ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ జంటగా నటించగా, విజయ్ ఎబినేజర్ సంగీతం అందించాడు.[1][2] 2012లో తమిళంలో వచ్చిన కళాకళప్పు చిత్రానికి రిమేక్ చిత్రమిది. ఇందులో నరేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.[3]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఇ. సత్తిబాబు
  • నిర్మాత: అంబికా కృష్ణ
  • రచన: సుందర్ .సి
  • సంగీతం: విజయ్ ఎబినేజర్
  • ఛాయాగ్రహణం: దాశరథి సివేంద్ర
  • నిర్మాణ సంస్థ: వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్

పాటలు

సంగీత దర్శకుడు విజయ్ ఎబినేజర్, తమిళ చిత్రంలోని ట్యూన్లనే ఈ సినిమాకు ఉపయోగించాడు. 2014, మే 31న పాటలు విడుదలయ్యాయి.[4] ఈ కార్యక్రమంలో నరేష్, స్వాతి దీక్షిత్, ఇషా చావ్లా, మంచు విష్ణు తదితరులు హాట్ ఎయిర్ బెలూన్ ను ఆకాశంలోకి వదిలేసారు.[5]

  1. లక్కీ లడ్కీ - టిప్పు - 4:10
  2. ఖానా ఖజాన - సుచిత్ర, స్టీవ్ వాట్జ్ - 4:21
  3. వెల్ కమ్ - గీతా మాధురి, క్రిష్ - 4:42
  4. శ్రీమంతుడు - మనో, రాహుల్ నంబియార్, మాళవిక - 3:55
  5. రంగు రంగు - కార్తీక్ ముత్తురామన్, కార్తీక్ - 4:24
  6. టంప్ జిలాని (టైటిల్ సాంగ్) - కార్తీక్ సైమన్స్ - 1:59

విడుదల

దక్కన్ క్రానికల్ ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది, ఇది టైమ్-పాస్ చిత్రం, చిత్రం రెండవ భాగంలో వినోదం ఉంటుంది అని పేర్కొంది.[6] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది, కథాంశం, సంగీతం, నటన, రచన, ఛాయాగ్రహణం వంటివి బాగున్నాయి" అని పేర్కొంది.[7] ఈ చిత్రం 2014, సెప్టెంబరు 14న జెమినీ టీవీలో ప్రసారమయింది.[8]

మూలాలు

  1. 123తెలుగు. "చిట్ చాట్: ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ 'జంప్ జిలానీ'కి హైలైట్ అవుతుంది". www.123telugu.com. Retrieved 4 August 2020.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  3. "Jump Jilani - Times of India". The Times of India.
  4. "Jump Jilani's audio to be launched on May 31 - Times of India". The Times of India.
  5. "Jump Jilani's audio launch wows T-town - Times of India". The Times of India.
  6. Kavirayani, Suresh (June 13, 2014). "Movie Review 'Jump Jilani': It's a routine comedy". Deccan Chronicle.
  7. "Jump Jilani Movie Review {2/5}: Critic Review of Jump Jilani by Times of India" – via timesofindia.indiatimes.com.
  8. "Jump Jilani to be aired on TV on September 14 - Times of India". The Times of India.

ఇతర లంకెలు