జగన్మోహన్ ప్యాలెస్

From tewiki
Revision as of 19:28, 4 March 2017 by imported>Pranayraj1985 (వర్గం:కర్ణాటక పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
మైసూర్ లోని జగన్మోహన్ ప్యాలెస్
ప్యాలెస్ ముఖద్వారంలోని బొమ్మ

జగన్మోహన్ ప్యాలెస్, కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులు ఉడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఉడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.