జనమంచి వేంకటరామయ్య

From tewiki
Jump to navigation Jump to search

జనమంచి వేంకటరామయ్య (1872 - 1933) ప్రముఖ తెలుగు రచయిత.

జీవిత విశేషాలు

అతను కాశ్యప గోత్రానికి చెందినవాడు. అతను 1872లో బ్రహ్మావధాని, మహాలక్ష్మీ దంపతులకు రాజమహేంద్రవరము లో జన్మించాడు. జీవితము ఛాందసప్రవృత్తిలో నడపించినను, భావములు జాతీయమార్గమున మెఱుగులు దేఱినవి. వేంకటరామయ్యగారు మాలతీమాధవము, ఉత్తరరామచరితము. రాజశేఖరుని విద్ధసాలభంజిక రసోత్తరముగా ననువదించిరి. విద్ధసాలభంజిక 1906 లో రచితమై చిలకమర్తి లక్ష్మీనరసింహము వెలువరించిన 'మనోరమ' పత్రికయందు బ్రకటింప బడినది. ఉత్తరరామచరిత్రాంధ్రీకృతి యసంపూర్ణము. మహాకవి రాజమహేంద్రవరము మునిసిపలుహైస్కూలు సహాయోపాధ్యాయుడై శిష్యబృందమునకు సాహిత్యభిక్ష నందించెను.[1]

అతను 1933 జనవరి 19న మరణించాడు.[2]

కృతులు

  • 1. నవకుసుమాంజలి : ఈ కూర్పు 23 ఖండ కావ్యముల సంపుటము
  • 2. మాలతీ మాధవము [3]
  • 3. విద్ధసాలభంజిక (అనువాదములు)
  • 4. సుప్రభాతము (ఖండకావ్యము)
  • 5. మేఘదూత.
  • 6. ఉత్తరరామచరితము. ఇత్యాదులు.
  • అమృతభాండం - ఖండకావ్యము. ఇందులో జాతీయ దృక్పథమునకు ప్రకటించిరి.

మూలాలు

  1. ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1850, పేజీలు: 272-6.
  2. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-27.[permanent dead link]
  3. మాలతీమాధవము 1946 తృతీయ ముద్రణ.

బహ్య లంకెలు

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: