జహీరాబాద్ (M)

From tewiki
(Redirected from జహీరాబాద్)
Jump to navigation Jump to search

జహీరాబాద్ (M), తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలంలోని గ్రామం.[1]

జహీరాబాద్ (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
[[Image:
దస్త్రం:Zaheerabad 01.JPG
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి
|250px|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం జహీరాబాద్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదునుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. పిన్ కోడ్ నం. 502 220., ఎస్.టి.డి.కోడ్ = 08451.

పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది. జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు 17°41′N 77°37′E / 17.68°N 77.62°E / 17.68; 77.62[2]. సగటు ఎత్తు 622 మీటర్లు (2040 అడుగులు).

ఇక్కడి నుండి కర్ణాటక రాష్ట్ర్రపు బీదర్ పట్టణానికి 25 కి.మీ. దూరం.చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది.

దేవాలయాలు

  • సాయినాథుని మందిరం: సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.[1]
  • కేతకి సంగమేశ్వర ఆలయం: జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ది చెందిన కేతకి సంగమేశ్వ ఆలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసి గంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ది. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ది. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Falling Rain Genomics, Inc - Zahirabad

వెలుపలి లంకెలు