"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "జాతీయ కార్మిక దినోత్సవం"

From tewiki
Jump to navigation Jump to search
m
m
Line 11: Line 11:
 
==మూలాలు==
 
==మూలాలు==
 
<references />
 
<references />
 +
[[వర్గం:పండుగలు]]
 +
[[వర్గం:జాతీయ పండుగలు]]
 +
[[వర్గం:చరిత్ర]]

Revision as of 13:06, 2 April 2021

సెప్టెంబర్ 17 న విశ్వకర్మ జయంతి సందర్భంగా జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం.[1]

Viswakarma.jpg

విశ్వకర్మ

విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సహజ జీవనానికి సంబంధించిన వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తన అసామాన్య ప్రతిభతో అనేక రకాల పరికరాలను, యంత్రాలను రూపొందించాడు. విశ్వకర్మ తమ పూర్వీకుడు అయినందుకు భారతీయు లంతా గర్వించాలి. విశ్వకర్మ రూపొందించిన పనిముట్లతో స్వీయ నిర్వహణతో సాగిన వృత్తులతో కూడిన ఆర్థిక వ్యవస్థ విలసిల్లింది. ప్రతి కుటుంబం తమదైన వృత్తి పరిశ్రమను నిర్వహించేది. వ్యవస్థీకృతమైన కుటుంబ పరిశ్రమల పరంపర విశ్వకర్మ నుంచే మొదలయ్యింది.[2]

శ్రమ పట్ల విశ్వకర్మ

శ్రమకు సాధన తోడై, సమర్పణ భావం కూడా ఉంటే సమాజంలో సంపదలు వెల్లువెత్తుతాయి. శ్రమవలన సంపద సమకూరుతుంది. శ్రమయే యజ్ఞం. మన దేశ సంపూర్ణ వికాస సాధనలో పనిచేస్తున్న వారంతా విశ్వకర్మను స్మరించడం, అనుసరించడం అవసరం.

మజ్దూర్ సంఘ్

విశ్వకర్మ జయంతిని ‘‘జాతీయ కార్మిక దినోత్సవం’’గా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌జరుపుతోంది. జాతీయాభ్యుదయానికి బహుముఖ కృషి అవసరం. సంకల్పం, త్యాగ, తపః, బలిదానాల పునాదిపై కార్మికోద్యమాలను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ గుణాలకు ప్రతిరూపమైన భగవాన్‌ ‌విశ్వకర్మను ఆదర్శంగా భావిస్తోంది. విశ్వకర్మ జయంతి అయిన సెప్టెంబరు 17న దేశమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటారు.

మూలాలు

  1. "లోకహితం సామాజిక సాంస్కృతిక మాస పత్రిక". 2020 September.
  2. "విశ్వకర్మ తెవికీ".