జువ్వాడి రత్నాకర్ రావు

From tewiki
Jump to navigation Jump to search
జువ్వాడి రత్నాకర్‌ రావు

దేవాదాయ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2007
నియోజకవర్గం బుగ్గారం అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 04, 1928
తిమ్మాపూర్ గ్రామం, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
సంతానం ఇద్దరు కుమారులు జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణా రావు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జువ్వాడి రత్నాకర్‌ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు.

జననం

జువ్వాడి రత్నాకర్ రావు 1928, అక్టోబరు 4న జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

జువ్వాడి రత్నాకర్‌ రావు తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు, కొంతకాలం జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి, పన్నెండేళ్ల పాటు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. 1981లో జగిత్యాల సమితి అధ్యక్షులుగా గెలుపొందాడు. ధర్మపురి ఆలయ కమిటీ మొదటి పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

1989లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పని చేశాడు. 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కోరుట్ల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

మరణం

అనారోగ్యంతో బాధపడుతూ 2020, మే 10న కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.[1]

మూలాలు

  1. సాక్షి, తెలంగాణ (10 May 2020). "మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత". Sakshi. Archived from the original on 10 మే 2020. Retrieved 10 May 2020.