"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జోగినపల్లి సంతోష్

From tewiki
Jump to navigation Jump to search
జోగినపల్లి సంతోష్
దస్త్రం:Joginapally santhosh.jpeg
జోగినపల్లి సంతోష్ ముఖ చిత్రం
జననం1976,డిసెంబర్ 7
జాతీయతభారతీయుడు
Citizenshipభారత్
వృత్తిరాజకీయవేత్త
Organizationటీఆర్ఎస్

జోగినపల్లి సంతోష్ టీన్యూస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగికుడు.[1]13ఏళ్లుగా ఆయనతో పాటే ఉన్నారు. 2018 లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.

జననం

కరీంనగర్ జిల్లా, బోయినపల్లి మండలం కొదురుపాకలో 1976, డిసెంబరు 7న జన్మించారు.

చదువు

ప్రాథమిక విద్య కరీంనగర్ లో పూర్తి చేసిన సంతోష్..ఉన్నత విద్య హైదరాబాద్ లో పూర్తి చేశారు.పూణే యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పర్సనల్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేశారు.

కుటుంబం

తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళ. భార్య రోహిణి. ఇద్దరు పిల్లలు ఇషాన్, శ్రేయాన్.

రాజకీయ ప్రవేశం

ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే.. కేసీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.2001లో టీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2004లో హరీష్ రావు మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు

సంస్థ

ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే.. కేసీఆర్ సలహాతో టీన్యూస్ ఛానెల్ ఏర్పాటు చేశారు. దానికి ఎండీగా వ్యవహరిస్తున్నారు.

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, పేజీ నంబర్ 6, తేది12-03-18