"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
టైపింగు సహాయం
దస్త్రం:Type in Telugu on Telugu Wikimedia projects.webm
లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు) లేక ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ కొరకు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే నరయం అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో నా అభిరుచులు వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీయకరణ విభాగంలో More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు. ప్రవేశపద్ధతులలో లిప్యంతరీకరణ మరియు ఇన్‌స్క్రిప్ట్ పద్ధతులు కలవు. అప్రమేయంగా వ్యవస్థ కీబోర్డు పద్దతి చేతనం చేయబడి వుంటుంది. CTRL+M కీ వాడడం ద్వారా ఎంపిక చేసిన కీబోర్డుని అచేతనం చేసి వ్యవస్థ కీ బోర్డు కి మారవచ్చు అలాగే మరల ఎంపిక చేసిన కీబోర్డుకి మారవచ్చు.
కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి కీ బోర్డు వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి.
Contents
లిప్యంతరీకరణ
లిప్యంతరీకరణ అంటే, ఇంగ్లీషు లిపిలో టైపు చేస్తూ ఉంటే దానంతట అదే తెలుగు లిపి లోకి మారిపోవడం. ఉదాహరణకు "telugu" అని రాస్తే అది "తెలుగు" అని మారిపోతుంది. ఇది రైస్ ట్రాన్స్లిటరేషన్ స్టాండర్డ్ ఫై ఆధారపడిన పద్ధతి.
అక్షరమాల
లిప్యంతరీకరణ చేసేందుకు ఏయే తెలుగు అక్షరం కోసం ఏ ఇంగ్లీషు అక్షరం/అక్షరాలు వాడాలో కింద ఇచ్చిన పట్టికలలో చూడవచ్చు. క్యాపిటల్ లెటర్సుకు స్మాల్ లెటర్సుకూ తేడా ఉండటాన్ని గమనించండి.
a | A = aa | i | I = ee = ii = ia | u | oo = uu = U | R | Ru | ~l | ~L |
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ |
e | E = ae = ea | ai | o | O = oa | au = ou | aM | aH | ||
ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
ka | kha = Ka | ga | gha = Ga | ~m |
క | ఖ | గ | ఘ | ఙ |
ca = cha | Ca = Cha | ja | jha = Ja | ~n |
చ | ఛ | జ | ఝ | ఞ |
Ta | Tha | Da | Dha | Na |
ట | ఠ | డ | ఢ | ణ |
ta | tha | da | dha | na |
త | థ | ద | ధ | న |
pa | Pa = pha = fa | ba | bha = Ba | ma |
ప | ఫ | బ | భ | మ |
ya | ra | la | va = wa | Sa | sha | sa | ha | La | xa = ksha | ~ra |
య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ప్రత్యేక అక్షరాలు
- ఌ = ~l
- ౡ = ~L
- అరసున్నా (ఁ) = @M
- సున్నా = M
- విసర్గ (ః) = H లేదా @h
- అవగ్రహ (ఽ) = @2
- నకార పొల్లు = @n
- ఖాళీ స్పేసు = _ (అండర్స్కోర్)
- జీరో విడ్త్ నాన్ జాయినర్ (ZWNJ): తెలుగు అజంత భాష. పదాంతంలో పొల్లు ఉండదు. అలాగే పదం మధ్యలో కూడా పొల్లు రాదు. ఇతర భాషా పదాలను తెలుగులో రాసేటపుడు పదం మధ్యలో పొల్లు రాయాల్సి ఉంటుంది. అయితే తెలుగు భాషకున్న సహజ లక్షణం ప్రకారం పొల్లుకు తర్వాతి అక్షరం ముందు అక్షరానికి వత్తుగా మారిపోతుంది. ఉదాహరణకు "ఆన్లైన్లో" అని రాయాలనుకోండి.. పై పట్టికలలోని సూత్రాల ప్రకారం "aanlainlO" అని ఇంగ్లీషు లిపిలో రాయాలి. అలా రాస్తే తెలుగు లిపిలో అది "ఆన్లైన్లో" అని పడుతుంది. దీన్ని నివారించేందుకు "క్యారట్" (కీబోర్డులో "6" అంకె కీతో పాటు ఉంటుంది చూడండి.) ను వాడాలి, ఇలాగ: aan^lain^lO. అప్పుడు "ఆన్లైన్లో" అని సరిగా లిప్యంతరీకరిస్తుంది. ఈ సందర్భంలో క్యారట్‌ను జీరో విడ్త్ నాన్ జాయినర్ (Zero Width Non Joiner) అంటారు.[1]
- ౘాప లోని ౘ = ~ca (యూనీకోడ్ వచ్చే వర్షన్లో)
- ౙాము రాతిరి లోని ౙ = ~ja (యూనీకోడ్ వచ్చే వర్షన్లో)
కొన్ని క్లిష్టమైన పదాలు
- విజ్ఞానము vij~nAnamu
- శాస్త్రజ్ఞుడు SAstraj~nuDu
- రామ్ rAm&
- రాం rAM
- ఫైర్ఫాక్స్ fire^faaks
- హోమ్‌పేజీ hOm^pEjI
- ఎంజైమ్ eMjaim
- ఆన్లైన్ An^lain
- లిమ్కా limkA
- ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
- వ్యాఖ్యానం vyAkhyAnaM
- అనిశ్చితి aniSciti
- దుఃఖసాగరం duHkhasaagaram
- తెలుఁగు telu@Mgu
- ఆమ్లం aamlaM లేదా AmlaM
- పాన్పు paan&pu
- అన్వేషణ an&vEshaNa
- ఇన్ఫోసిస్ in&FOsis
కొన్ని ఉదాహరణలు
dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స
telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు
viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ
SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య
fair^fAks veb^braujar - ఫైర్ఫాక్స్ వెబ్‌బ్రౌజర్
yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.
సమస్యలు
వికీపీడియా పద్ధతి(ఆంగ్లం లింకు) లో శాస్త్రజ్ఞుడు (SAstraj~nuDu) శాస్త్రజ్ఞఉడు గా చేర్చబడుతుంది. అంటే జ్ఞ గుణింతం సరిగా లేదు. (బగ్ T231955 ) ఈ గుణింతాలు వ్రాయవలసివస్తే ఇతర పద్ధతుల ద్వారా లేక ఆ పదాన్ని గూగుల్ లో ఆంగ్లాక్షరాలతో వెతికి అప్పుడు కనబడిన సరియైన తెలుగు పదం నకలు చేసి అతికించండి. లేక మెరుగైన తెలివైన కీ బోర్డు పద్ధతులు వాడండి.
ఇన్ స్క్రిప్టు
- ఇన్‌స్క్రిప్ట్ చూడండి
చూడండి
- వికీపీడియా ULS వాడుతున్న లిప్యంతరీకరణం పట్టిక
- వికీపీడియా:విండోస్ 10 తెలుగు కీ బోర్డు ఎంపిక
- వికీపీడియా:విండోసు XP
- టైపు అనుభవం తెచ్చుకుంటూనే వికీప్రాజెక్టుకు తోడ్పడడానికీ వికీసోర్స్ లో సమిష్ఠి కృషి చూడండి.
- వికీపీడియా:తెలుగు టైపు తెలియని వారు కూడా చేయగలిగే శుద్ధి పనులు
- మీడియా వికీ వికీలో పూర్తి వివరాలు
వనరులు