Open main menu

తీపలపూడి ఏసన్న

తీపలపూడి ఏసన్న బ్రదర్ ఏసన్న అంతర్జాతీయ సువార్తికుడు, హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు. నెల్లూరు కబడిపాలెంలో జన్మించారు.1976 లో గుంటూరు జిల్లా లేమల్లెకు వచ్చి చిన్న చర్చి ప్రారంబించారు.1986 లో నగరంలోని శారదా కాలనీ, 1996లో గోరంట్ల వద్ద మందిరాన్ని సువిశాల స్థలంలో హోసన్న మినిస్ట్రీ ఆరంబించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 చర్చిలు నిర్మించారు. ప్రతి యేటా మార్చి నెలలో గుడారాల పండుగ నిర్వహించారు.అనేక క్రైస్తవ భక్తి గీతాలు రాశారు, పాడారు. వాటిని సీడీల రూపంలో విడుదల చేసే వారు. ఆయన పాటలంటే భక్తులు ఎంతో మక్కువ చూపేవారు. బ్రదర్‌ ఏసన్న వివాహం చేసుకుంటే భార్య, సంతానం వల్ల దేవునిసేవకు ఆటంకం కలుగుతుందని భావించి ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు. నిత్యం ప్రభు నామస్మరణలో కాలం గడిపారు. క్రైస్తవ మత ప్రచారకుడై జీవితాంతం బ్రహ్మచారి గానే ఉండి తన 66 వ యేట 8.8.2012 న గోరంట్లలో మరణించారు.

భగవంతుడిని మరచిపోతారు

'నన్ను మందిరంలో సమాధి చేస్తే భగవంతునిగా ఆరాధిస్తారు. దీంతో ఆ భగవంతుడిని కొలవడం మరచిపోతారు. అందువల్ల నన్ను మందిరంలో సమాధి చేయవద్దు. సాధారణ వ్యక్తిలా శ్మశాన వాటికలో సమాధి చేయండని' ఏసన్న పలు సందర్భాల్లో మందిరం సభ్యులకు సూచించిన సూచనల ప్రకారమే సమాధి కార్యక్రమం గోరంట్ల హోసన్నా మందిరంలో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించారు. (ఈనాడు 11.8.2012)