"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తొగరాం

From tewiki
Jump to navigation Jump to search
తొగరాం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఆముదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 782
 - స్త్రీల సంఖ్య 802
 - గృహాల సంఖ్య 435
పిన్ కోడ్ 532484
ఎస్.టి.డి కోడ్

తొగరాం, శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆమదాలవలస నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 435 ఇళ్లతో, 1584 జనాభాతో 442 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 782, ఆడవారి సంఖ్య 802. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 241 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581405[1].పిన్ కోడ్: 532484.

గ్రామ విశేషాలు

ఇది శ్రీకాకుళం (పట్టణం) నకు 15 కి.మీ దూరంలో నాగావళి నది తీరంలో ఉంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుర్వేద ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి[2]. ఈ గ్రామములో వెనుకబడిన తరగతుల వసతి గృహం ఉండేది. 2013లో ఇదిమూసివేయబడినది. ఈ గ్రామంలోప్రముఖ వ్యక్తి తమ్మినేని శ్రీరామమూర్తి . ఇతని సోదరుడు తమ్మినేని పాపారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యునిగా ప్రజల గూర్చి అనేక త్యాగాలను చేసిన వ్యక్తిగా పేరు పొందారు. శ్రీరామమూర్తి కుమారులు తమ్మినేని విజయవర్థనరావు, తమ్మినేని శ్యామలరావు, తమ్మినేని సీతారాంలు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా ఖ్యాతి పొందారు. తమ్మినేని సీతారాం తెలుగు దేశం పార్టీలో అనేక శాసన సభ్యులుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేసిన వ్యక్తి. తమ్మినేని సీతారాం పెదనాన్న తమ్మినేని పాపారావు నాలుగు సార్లు ఎమ్ ఎల్ ఏ అయ్యాడు. సీతారాం ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. పలు శాఖల మంత్రిగా పదేళ్ళపాటు టిడిపిలో ఎన్ టి ఆర్, బాబు సర్కార్లలో పనిచేసాడు. శ్రీరామమూర్తి కుమార్తె కొడుకే ప్రభుత్వ విప్ కూన రవికుమార్. తమ్మినేని పాపారావు ఒకమారు ఇండిపెండెంటుగా, రెండుమార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికకాగా, పైడి శ్రీరామమూర్తి ఒకసారి ఇండిపెండెంటుగా గెలిచారు.

గ్రామంలో ప్రముఖులు

తమ్మినేని పాపారావు

అతను శ్రీకాకుళం జిల్లా నగరికటకం అసెంబ్లీ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 1955 లో గెలుపొందాడు. అతను 1916 ఏప్రిల్ 16 న జన్మించాడు. అతను గాంధీ హరిజన సేవా సంఘ సభ్యునిగా పనిచేసాడు. 1934లో జిల్లా కాంగ్రెస్ సభ్యునిగా చేరాడు. 1950లో జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షులైనాడు. 1953-54లో జిల్లా కాంగ్రెస్ సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు,ఆంధ్రా స్టేట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులకు డైరక్టరుగా పనిచేసాడు. అతను రైతు సమస్యలపై విశేషంగా కృషిచేసి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలను పొందాడు.[3] నాలుగు సార్లు ఎమ్ ఎల్ ఏ గా ఎన్నికయ్యాడు.

తమ్మినేని శ్రీరామమూర్తి

తమ్మినేని శ్రీరామ్మూర్తి కాంట్రాక్టరుగా, గ్రామ నాయకునిగా పనిచేశాడు. శ్రీరామ్మూర్తి ఆనాటి శాసన సభ్యులు తమ్మినేని పాపారావుకు, జెడ్పీ వైస్ చైర్మన్ చిరంజీవికి సోదరునిగా ఈ నియోజకవర్గంలో సుపరిచితుడు. అతని భార్య ఇందుమతి. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు తమ్మినేని విజయవర్ధనరావు గ్రామసర్పంచ్‌గా, రెండవ కుమారుడు తమ్మినేని శ్యామలరావు జెడ్పీటిసిగాను పనిచేశారు. మూడో కుమారుడు సీతారాం వైకాపాలో కొనసాగుతున్నాడు.[4]

తమ్మినేని శ్యామలరావు

తమ్మినేని శ్యామలరావు గారు శ్రీరామమూర్తి,ఇందుమతి దంపతుల రెండవ కుమారుడు. అతను ఆమదాలవలస సుగర్స్ చైర్మన్ గా పనిచేసాడు. అతని కుమార్తె తమ్మినేసి సుజాత[5].

తమ్మినేని సీతారాం

దస్త్రం:Tammineni Seetharam at zphs, thogaram.jpg
తమ్మినేసి సీతారాం

తమ్మినేసి సీతారాం శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 1980లో తన 18వ యేటనే ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరక్టర్ గా పనిచేసాడు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. తొమ్మిదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసాడు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేసాడు.[6]

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావముతో తమ్మినేని సీతారాం ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయాడు. తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ' పిలుపు మేరకు గత ఎన్నికల్లో తెదేపాకు వదలి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తమ్మినేని సీతారాం కూడా ప్రజారాజ్యం పార్టీని వదలి 2009 ఆగస్టు 15 న తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టాడు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగాడు. బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశాడు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించాడు.అతను 2013 ఆగస్టు 29 న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరాడు[7]. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ పై పోటీ చేశారు కానీ ఓడిపోయాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించాడు. నవ్యాంధ్రప్రదేశ్ కు 2వ స్పీకరుగా తన సేవలనందిస్తున్నాడు.

విద్యా సౌకర్యాలు

గ్రామం లో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆమదాలవలసలోను శ్రీకాకుళం లో నూ, ఇంజనీరింగ్ కళాశాల శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ శ్రీకాకుళంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఆమదాలవలసలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

తొగరాంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

తొగరాంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

తొగరాంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 176 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 7 హెక్టార్లు
 • బంజరు భూమి: 4 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 254 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 77 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 181 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

తొగరాంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 181 హెక్టార్లు

ఉత్పత్తి

తొగరాంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

మూలాలు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-01.
 3. aan'dhrashaasanasabhyulu 1955
 4. "మాజీమంత్రి తమ్మినేనికి మాతృవియోగం". Archived from the original on 2013-01-03. Retrieved 2015-08-09.
 5. తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుజాత?[permanent dead link]
 6. వై.సి.పి లో చేరిన తమ్మినేసి సీతారాం
 7. "Ex-minister Tammineni Sitaram joins YSR Congress". దక్కన్ క్రానికల్. Retrieved 29 August 2013.[permanent dead link]

వెలుపలి లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.