"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దిశనీయత

From tewiki
Revision as of 17:42, 4 April 2018 by imported>ChaduvariAWBNew (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

సాంప్రదాయ కాంతి జనకాలైన సాధారణ దీపాలు, టార్చ్ లైట్లు, నుండి వెలువడే కాంతి అన్ని పైపులా వ్యాపిస్తాయి. దీనిని అపసరణం అంటారు. కానీ లేసర్ నుండి కాంతి కిరణాలు ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి. దీనినే లేసర్ కిరణాల దిశనీయత అంటారు. ఉదాహరణకు సెర్చ్ లైట్ నుండి ఉద్గారమైన కాంతి 1 కీ.మీ దూరం ప్రయాణించి 1 కి.మీ వ్యాసమున్న కిరణంగా విస్తరిస్తుంది. లేసర్ 1 కి.మీ దూరం ప్రయాణించి 1 సెం.మీ వ్యాసమున్న కిరణంగా మాత్రమే విస్తరిస్తుంది. ఇది లేసర్ యొక్క ప్రత్యేక లక్షణం.

లేసర్

లేసర్ (LASER) అనునది ఒక సంక్షిప్తపదం. ("Light Amplification by Stimulated Emission of Radiation") అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" చెందే ప్రక్రియను సూచిస్తుంది. లేసర్ ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గార దీపం, ఏకవర్ణ కాంతి జనకం, సోడియం దీపం వంటి కాంతి జనకలలో ఉండవు.

దీనిని 1954 వ సంవత్సరంలో డా.చార్లెస్.టౌన్స్ మొదటి సారిగా లేసర్ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించారు. 1960 వ సంవత్సరంలో అనేక శాస్త్రజ్ఞుల ప్రయాసలతో "స్పందన లేసర్" రూపొందింది.

లేసర్ కాంతి లక్షణాలు

సాధారణ కాంతి జనకానికి, లేసర్ కు మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. 1.సంబద్ధత 2.దిశనీయత 3. ఏకవర్ణీయత 4. తీవ్రత.