దేవదాసు (2006 సినిమా)

From tewiki
Revision as of 15:50, 24 April 2017 by imported>Nagarani Bethi (వర్గం:శ్రియా సరన్ నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దేవదాసు (2006 సినిమా)
(2006 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం వై.వి.ఎస్.చౌదరి
నిర్మాణం వై.వి.ఎస్.చౌదరి
రచన వై.వి.ఎస్.చౌదరి కథ, స్క్రీన్‌ప్లే
తారాగణం రామ్,
ఇలియానా,
సాయాజీ షిండే
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం భరణి కె.ధరన్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు
విడుదల తేదీ జనవరి 11 2006
భాష తెలుగు
పెట్టుబడి 7 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

2006 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో అద్భుతమైన విజయం సాధించిన ఒక చిత్రం దేవదాసు. ప్రధాన పాత్రలలో క్రొత్త నటులున్నా ఘనవిజయం సాధించి ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇదే పేరుమీద ఇంతకుముందు తెలుగులో మరి రెండు చిత్రాలు వచ్చి ఉండడం విశేషం.

కథ

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

దేవదాసు (రామ్)ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. భానుమతి (ఇలియానా) ఒక ధనిక ప్రవాస భారతీయుని కుమార్తె. ఆమె తండ్రి కాటమరాకు (సాయాజీ షిండే) న్యూయార్క్ నగరంలో సెనేటర్. భానుమతి నృత్యం నేర్చుకోవడానికి భారతదేశం వచ్చినపుడు దేవదాసుతో ప్రేమలో పడింది. ఈ సంగతి తెలిసి పిల్ల తండ్రి వారికి పెళ్ళిచేస్తానని నమ్మించి, తరువాత కూతురును న్యూయార్క్ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు చాకులాంటి దేవదాసు అమెరికా వెళ్ళడమూ, తాను ప్రేమించిన చిన్నదానిని స్వంతం చేసుకోవడమూ ఈ సినిమా ఇతివృత్తం.

ఇందులో మిగిలిన నటులతో బాటు నిర్మాత-దర్శకుడు (వై.వి.ఎస్.చౌదరి), సంగీత దర్శకుడు (చక్రి) అతిథి పాత్రలలో కనిపించడం మరో విశేషం.

ఈ చిత్రంలో ఇలియానా కళ్ళకు గంతలు కట్టబడిన సన్నివేశము బహు పసందుగా వుండును.

ఇతర సాంకేతిక వర్గం

అవీ ఇవీ

  • ఇందులో రామ్, ఇలియానా - ఇద్దరికీ ఇది మొదటి చిత్రమే.
  • ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులు ఆడింది.[1]

బయటి లింకులు