"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ధేరవాద బౌద్ధము

From tewiki
Jump to navigation Jump to search

థేరవాద బౌద్ధం అనునది బౌద్ధములోని ఒక విభాగ పాఠశాల. థేరవాదము అనగా "పెద్దల సిద్ధాంతం". ఈ ధర్మము త్రిపిటకములను ఆధారముగా చేసుకొని రూపుదిద్దుకొనినది.మిగతా బౌద్ధ విభాగ పాఠశాలతో పోల్చితే థేరవాదమే బుద్ధుని బోధనలకు దగ్గరగా ఉంటుందని ప్రతీతి.బుద్ధుని బోధనలు తప్పక పాటించే ఈ ధర్మములో సృష్టికర్త దేవుడు అనే అపోహలు ఉండవు. బౌద్ధములో సృష్టికర్త అనేవాడు లేడని నిర్థారిస్తారు.సర్వాంతర్యామి దేవుడు అనే వాదనను బుద్ధుడు కొట్టిపారేశారు.

చాలా శతాబ్దాలుగా థేరవాదము ఆగ్నేయాసియా ఖండము(థాయిలాండ్,మయన్మార్,కంబోడియా,లాఓస్,శ్రీలంక)లో ప్రధానమైన ధర్మముగా ఉన్నది.

ఈ ధర్మమును ఆచరించే వారి జనాభా 10 కోట్లకు పైనే.ఈ మధ్య కాలములో పశ్చిమ దేశాలైన అమెరికా,ఐరోపా,ఆఫ్రికా దేశాలలో థేరవాదమును ఆచరిస్తున్నారు.