పత్తెపురం

From tewiki
Jump to navigation Jump to search


పత్తెపురం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

ఫత్తేపురం, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.[1] లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామంలోని మౌలిక వసతులు

ఈ గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ప్రధాన రహదారి నుండి 680 మీటర్ల పొడవుతో, సిమెంటుతో నిర్మించనున్న రహదారికి, 2017, ఆగస్టు-9న శంకుస్థాపన నిర్వహించారు. [5]

గ్రామ పంచాయతీ

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కొల్లి రత్తాయమ్మ, సర్పంచ్‌గా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

ఫత్తేపురం గ్రామంలోని ప్రాచీన ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం

ఈ ఆలయంలో, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి, అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [4]

గ్రామంలోని ప్రధాన వృత్తులు

ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నారు.

గ్రామ విశేషాలు

మండలంలోనే 100% అక్షరాస్యత ఉన్న గ్రామంZ ఫత్తేపురం గ్రామంలోని యువకులు, ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేయుచున్నవారు, "కాకతీయ యువసేన"గా ఏర్పడి, రు. రెండున్నర లక్షల ఆర్థిక సహాయంతో, గ్రామంలో ఒక నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ కేంద్రానికి, 2014, జూన్-29, ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని యువకులను అభినందించారు. [2]

గణాంకాలు

జనాభా - 1500 పురుషుల సంఖ్య - 820 స్త్రీలు - 680

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఏప్రిల్-10; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జూన్-30; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-6; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017, ఆగస్టు-10; 2వపేజీ.