Open main menu

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటి స్పీకర్.[2] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే (2004).[3][4] 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.[5] టెలివిజన్ రాజకీయ చర్చల్లో తరచుగా కనిపించే పద్మా దేవేందర్ రెడ్డి మంచి వాక్పటిమ కలవారు.

పద్మా దేవేందర్ రెడ్డి
పద్మా దేవేందర్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014, 2018
నియోజకవర్గము మెదక్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటి స్పీకర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-06) 6 జనవరి 1969 (వయస్సు 52)[1]
నామాపూర్, కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్

జననం

పద్మ దేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, నామాపూర్ గ్రామంలో జన్మించారు. ఆమె కరీంనగర్ లోని శాంతినికేతన్ పాఠశాలలో స్కూల్ విద్యను చదివి, బి.ఎ. మరియు ఎల్.ఎల్.బి. చేసారు.

వృత్తి జీవితం

రాజకీయాలలోకి ప్రవేశించక ముందు రంగారెడ్డి జిల్లా కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998 నుంచి 2001 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఈవిడ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించారు.

రాజకీయ జీవితం

పద్మ దేవేందర్ రెడ్డి 2001 ఏప్రిల్ లో రాజకీయరంగంలోకి ప్రవేశించారు. 2001లో మెదక్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుండి జెడ్.పి.టి.సి.గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత, 12,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు.

2009 లో టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్య, 2010 లో మళ్లీ పార్టీలో చేరారు.[6] 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలైన విజయశాంతిని ఓడించి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు. 2018లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందారు.[7][8][9]

డిప్యూటి స్పీకర్

పద్మ దేవేందర్ రెడ్డి 2014, జూన్ 12న తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[10]

మూలాలు

  1. http://www.telanganastateinfo.com/telangana-first-deputy-speaker-padma-devender-reddy/
  2. "First Women deputy speaker in Telangana Legislative Assembly". TelanganaNewsPaper. 2017-01-06.
  3. http://www.hindu.com/2009/04/04/stories/2009040457980300.htm
  4. http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=7195
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  6. http://indiatoday.intoday.in/story/trs-chief-resigns-telangana-bandh-for-48-hours-begins/1/143686.html
  7. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  8. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  9. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  10. http://www.newindianexpress.com/states/telangana/Padma-All-Set-to-be-Telangana-House-Dy-Speaker/2014/06/12/article2276543.ece

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).