"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పాకాల తిరుమల్ రెడ్డి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పాకాల తిరుమల రెడ్డి | |
---|---|
దస్త్రం:Ptreddy.jpg | |
జననం | అన్నారం గ్రామం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ | జనవరి
4, 1915
మరణం | అక్టోబరు 21, 1996 | (వయస్సు 81)
వృత్తి | చిత్రకారుడు |
జీవిత భాగస్వాములు | పి.యశోదారెడ్డి |
పాకాల తిరుమల్ రెడ్డి (జనవరి 4, 1915 - అక్టోబర్ 21, 1996) చిత్రకళారంగంలో పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.
జననం
కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో 1915, జనవరి 4 న జన్మించాడు. 1942లో బొంబాయి సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల లోనే కాక ఆస్ట్రేలియా, యు.కె, జపాన్, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు.
ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్లో పనిచేసాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నాడు. హైదరాబాదు నారాయణ గూడ లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. హైదరాబాద్, బొంబాయి వీధులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో, రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం.
మరణం
1996, అక్టోబర్ 21 న ఆయన మరణించాడు. పి.టి.రెడ్డి భార్య ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి.
చిత్రాలయం
- పి.టి.రెడ్డి గూర్చి ఢిల్లీ ఆర్ట్ గాలరీ లో
- కొన్ని చిత్రాలు 1 2
- ఐ లవ్ హైద్రాబాద్లో మరి కొన్ని చిత్రాలు 1 2 3 4 5 6 7 8 9 10 11
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).