పింగళి సూరనామాత్యుడు

From tewiki
Jump to navigation Jump to search

పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)

  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
  • రాఘవపాండవీయం
  • కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
  • ప్రభావతీప్రద్యుమ్నం

పింగళి సూరన కవి వంశము

సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన గోకనామాత్వుడు పింగళి యను గ్రామంన నివసించుటచే నా వంశము వారందరికీ పింగళి వారని వంశ నామము వచ్చెనట.

సూరన నివాసము

పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ఈతడు కర్నూలు జిల్లా లోని నంద్యాల మండలం కానాల గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామంలో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాఠశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయలసీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.

మూలాలు, వనరులు


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు


రెండర్థముల పద్య మొక్కటియు నిర్మింపగ శక్యంబుగా కుండుం దద్గతి గావ్యమెల్ల నగునే నోహో యనంజేయదే పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బం బద్భుతం బండ్రు ద క్షుం డెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషాకృతిన్