"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పైళ్ల శేఖర్ రెడ్డి

From tewiki
Revision as of 10:57, 4 July 2019 by imported>ChaduvariAWBNew (→‎మూలాలు: AWB తో వర్గం మార్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
పైళ్ల శేఖర్ రెడ్డి
పైళ్ల శేఖర్ రెడ్డి


శాసనసభ్యుడు
పదవీ కాలము
జూన్ 2, 2014 – 2019
నియోజకవర్గము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం 1968 (age 52–53)
కదిరేణి గూడెం, ఆత్మకూరు మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్, తెలంగాణ
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

పైళ్ల శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నియ్యాడు.[1] పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు.[2]

జననం - విద్యాభ్యాసం

పైళ్ల శేఖర్ రెడ్డి 1968లో, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలోని కదిరేణి గూడెంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు రాంరెడ్డి. ఈయనది వ్యవసాయ కుటుంబం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఖమ్మంలో ఉన్న ఎస్.ఈ.ఎస్. మూర్తి పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తిచేశాడు.

వృత్తి

రాజకీయాలలోకి ప్రవేశించక ముందు హైదరాబాద్, బెంగుళూర్ లలో ఒక స్థిరాస్తి రంగం (రియల్ ఎస్టేట్) లో ఉన్నాడు.

రాజకీయ ప్రస్థానం

2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డిపై ఎన్నియ్యాడు. పైళ్ల శేఖర్ రెడ్డి 54,686 ఓట్లు రాగా, జిట్టా బాలకృష్ణారెడ్డి 15,416 ఓట్లు వచ్చాయి.[3]

ఇతర వివరాలు

ఫ్లోరైడ్ కాలుష్యంతో బాధపడుతున్న నల్గొండ జిల్లా వాసులకు శుభ్రమైన త్రాగు నీటిని అందించాడు.[4]

మూలాలు

  1. "Andhra Pradesh Result Status". ELECTION COMMISSION OF INDIA. 21 May 2014. Retrieved 11 June 2014. Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. http://www.sakshi.com/news/telangana/speed-of-nims-constructions-141570
  3. http://newsreporter.in/pailla-shekar-reddy-of-trs-leads-the-bhongir-constituency-andhra-pradesh-andhra-pradesh-assembly-election-2014-507729
  4. http://www.10tv.in/news/tgexpress/Pailla-Shekar-Reddy-develops-Aleru-45386

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).