"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రసిద్ధ సమర్రా మస్జిద్

From tewiki
Jump to navigation Jump to search
ప్రసిద్ధ సమర్రా మసీదు
Samara spiralovity minaret rijen1973.jpg
గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా మినారెట్
ప్రదేశంసమర్రా, ఇరాక్
భౌగోళికాంశాలు34°12′21″N 43°52′47″E / 34.20583°N 43.87972°E / 34.20583; 43.87972Coordinates: 34°12′21″N 43°52′47″E / 34.20583°N 43.87972°E / 34.20583; 43.87972
స్థాపితం848

ప్రసిద్ధ సమర్రా మసీదు లేదా గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా ఇరాక్ దేశంలో ఉన్న ఒక అద్భుత మసీదు. ఈ కట్టడాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడం గా ప్రకటించారు.

విశేశాలు

  • దూరం నుంచి చూడ్డానికి భారీ స్తంభంలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే మెలికలు తిరిగిన మేడలా నిర్మాణం ఎంతో అబ్బురపరుస్తుంది. ఇక పైకెళితే కానీ తెలీదు అదో మసీదు అని.
  • దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి పాలకుడు అబ్బాసిద్ కలీఫ్ ఆల్ ముతవక్కీ హయాంలో కట్టించారు. క్రీ||శ 848లో మసీదు నిర్మాణం మొదలెడితే 851లో పూర్తయ్యింది. అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు గా ఇది కీర్తించబడినది.
  • స్తంభంలా కనిపించే దీని ఎత్తు 170 అడుగులు. అంటే సుమారు 15 అంతస్తుల భవనమంత. ఇక చుట్టు కొలత 100 అడుగుల పైనే!
  • భవనం పై భాగంలో మసీదును నిర్మించారు. అయితే పైకెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లేమీ ఉండవు. భవనం గోడలనే ర్యాంప్‌లా కట్టడంతో దానిపై నుంచే నడుచుకుంటూ వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత.
  • మసీదు లోపలికి వెళ్లడానికి సుమారు 17 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. లోపల కూడా చక్కని ఇస్లామిక్ నిర్మాణశైలితో ప్రాచీన కళాకృతులు, చెక్కుళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
  • మసీదుపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. 2005లో దీనిపై ఒక బాంబు కూడా పడింది. మళ్లీ మరమ్మతులు చేసి పూర్వవైభవం తీసుకొచ్చారు.
  • ఈ మసీదును అనుకరిస్తూ ఈజిప్టుతోపాటు ఎన్నో ప్రాంతాల్లో దీని నమూనాల్లో మసీదులు కట్టారు.

బయటి లంకెలు