"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బిర్జూ మహరాజ్

From tewiki
Revision as of 11:23, 24 December 2020 by imported>రవిచంద్ర (లింకులు, పదాల అనువాదాలు. జాబితాలు మార్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
బిర్జూ మహరాజ్‌
దస్త్రం:Pandit Birju Maharaj.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1938-02-04) ఫిభ్రవరి 4, 1938 (వయస్సు 83)
వారణాసి, ఉత్తర ప్రదేశ్
మూలంభారతదేశం
సంగీత శైలిహిందుస్తానీ సంగీతము
వృత్తిశాస్త్రీయ నృత్యకారుడు
వెబ్‌సైటుhttp://www.birjumaharaj-kalashram.com/main.asp

బిర్జూ మహరాజ్‌గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

బాల్యం

తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.

నాట్య ప్రస్థానం

బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర, సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో పదవీ విరమణ చేశాడు. బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా షత్రంజ్ కే ఖిలారి లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, కాహె ఛేడ్ మొహె అనే పాటకు నాట్యం చేశాడు.

అవార్డులు, గౌరవ పురస్కారాలు

  1. పద్మవిభూషణ్ - 1996
  2. సంగీత నాటక అకాడమీ అవార్డు
  3. కాళిదాస్ సమ్మాన్
  4. డాక్టరేట్ డిగ్రీ - బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
  5. లతా మంగేష్కర్ పురస్కార్ - 2002

సినిమాలు

  1. దేవ్‌దాస్ (2002)
  2. గదర్ 2001
  3. దిల్ తో పాగల్ హై
  4. షత్రంజ్ కే ఖిలారి

వనరులు

  1. అచ్చన్ మహరాజ్
  2. బిర్జూ మహరాజ్ - కథక్
  3. బిర్జూ మహరాజ్

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).