"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బిలియన్

From tewiki
Revision as of 05:59, 26 October 2016 by imported>ChaduvariAWB (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, లో → లో , కూడ → కూడా , → (2) using AWB)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

బిలియన్ అనే పదాన్ని సాధారణముగా ఒక సంఖ్యను తెలుపడానికి ఉపయోగిస్తారు. ఒక బిలియన్ 1,000,000,000 కి సమానం. అనగా, భారతీయ సంఖ్యామానంలో వంద కోట్లు (1,00,00,00,000). శాస్త్రీయ పద్ధతిలో ఈ రెండింటిని అని సూచిస్తారు; ఇక్కడ 9 ఎన్ని సున్నలు ఉన్నాయో చెబుతుంది.

ఒకటి నుండి మిలియను వరకు వాడే సంఖ్యామానం పాశ్చాత్య ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంటుంది. బిలియను దాటిన తరువాత రెండు పద్ధతులలో చీలిపోతుంది; సంఖ్యని సూచించే పేరులో తేడా వస్తుంది. ఈ రెండు పద్ధతులలో ఒకదానిని "పొట్టి పద్ధతి" (short scale), రెండవదానిని "పొడుగు పద్ధతి" (long scale) అంటారు.

పొడుగు పద్ధతి: ఈ పద్ధతిలో

  • బిలియను (బి అంటే 2) మిలియను మిలియనులు లేదా .
  • ట్రిలియను (ట్రి అంటే 3) మిలియను మిలియను మిలియనులు లేదా .
  • వగైరా

ఈ పొడుగు పద్ధతి ఐరోపా‌లోను, ఫ్రెంచి, స్పేనిష్‌ భాషలు మాటాడే దేశాలలోను వాడుకలో ఉంది కాని అంతర్జాతీయ ఒత్తిడులవల్ల ఈ వాడుక సమసిపోయి, పొట్టి పద్ధతి అలవాటులోకి వస్తోంది. ఉదాహరణకి, బ్రిటన్‌లో 1974 వరకు పొడుగు పద్ధతి ఉండేది; తరువాత చట్టబద్ధంగా పొట్టి పద్ధని అమలులోకి తీసుకువచ్చేరు.

పొట్టి పద్ధతి: ఈ పద్ధతిలో

  • బిలియను (బి అంటే అర్థం లేదు) వెయ్యి మిలియనులు లేదా .
  • ట్రిలియను (ట్రి అంటే అర్థం లేదు) వెయ్యి బిలియనులు లేదా .
  • వగైరా

ఈ పొట్టి పద్ధతి ఇంగ్లీషు భాష, అరబిక్‌ భాష మాటాడే దేశాలలో వాడుకలో ఉంది.

భారతదేశంలో ఇంకా పురాతన పద్ధతే వాడుకలో ఉంది. భారతదేశం కూడా పొట్టి పద్ధతి ప్రకారం మిలియనులు, బిలియనులు, ట్రిలియనులు, వగైరా వాడి లక్షలు, కోట్లు, పదికోట్లు, వందకోట్లు, వెయ్యికోట్లు, లక్షకోట్లు, కోటికోట్లు, వగైరా లెక్కల నుండి బయటపడాలని వేమూరి వేంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు; కాని, ఎవ్వరూ వినడం లేదు.

పెట్టెల రూపంలో పొట్టి పద్ధతిని వివరించే చిత్రం

A ఒక పెట్టె; B అనే పెట్టెలో A జాతి పెట్టెలు 1,000 పడతాయి. C అనే పెట్టెలో B జాతి పెట్టెలు 1,000 పడతాయి. అలాగే, D అనే పెట్టెలో C జాతి పెట్టెలు 1,000 పడతాయి. కనుక 1 మిలియను A లు C లోనూ, 1,000,000,000 A లు D లోనూ ఉన్నాయి.

Billion-cubes-new.svg