"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బిహూ నృత్యం

From tewiki
Revision as of 18:38, 21 March 2020 by imported>ChaduvariAWBNew (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
"పెపా"తో బిహూ నర్తకుడు

బిహూ నృత్యం (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.

బొహాగ్ బిహు (వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి వక్క, తమలపాకు, డబ్బులు ఉంటాయి.

బిహూలో వంటకాలు

బిహూలో రక రకలైన పిఠా (బియ్యంపిండితో బెల్లం కలిప్ చేసే ఒక పిండి వంట) లు తయారు చేస్తారు.

 • తిల్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో నువ్వులు, బెల్లం పెట్టి చుడుతారు)
 • ఘిలా పిఠా
 • హుతులి పిఠా
 • సుంగా పిఠా
 • నారికొలోర్ లారు (కొబ్బరి లడ్డు)
 • నారికోలోర్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో కొబ్బరి, పంచదార పెట్టి చుడుతారు)
 • భాత్ పిఠా

=అల్పాహారాలు

 • బొరా సావుల్ (జిగురుగా ఉండే ఒక రకమైన బియ్యం)
 • కుమోల్ సావుల్ (
 • సిరా (అటుకులు)
 • మురి (మరమరాలు)
 • అఖోయ్ (
 • హాన్దో (హన్దో అనే ఒక రకమైన బియ్యపు పిండి)
 • దోయ్ (పెరుగు)
 • గూర్ (బెల్లం)

బిహూ లో ఉపయోగించే వాద్యాలు

 • ఢోల్ (డోలు)
 • తాల్
 • పెపా (ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం)
 • టొకా (వెదురుని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం)
 • బాహి (వేణువు)
 • హుతులి (చిన్న వాద్యం)
 • గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)