బెందాళం అశోక్

From tewiki
Revision as of 16:21, 21 July 2019 by imported>K.Venkataramana (వర్గం:శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు (2019) చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
బెందాళం అశోక్
బెందాళం అశోక్

బెందాళం అశోక్


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2014 - ప్రస్తుతం
ముందు పిరియా సాయిరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-08-10) 1982 ఆగస్టు 10 (వయస్సు 38)
రామయ్య పుట్టుగ, కవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు జ్యోతీబాల
ప్రకాష్ రావు
జీవిత భాగస్వామి బెందాళం నిలోత్ఫల
నివాసం రామయ్య పుట్టుగ, కవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి డెంటల్ కాలేజీ, ఏలూరు
వృత్తి బి.డి.యస్ -దంతవైద్యులు
మతం హిందూ

బెందాళం అశోక్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అతను ఇచ్చాపురం నియోజికవర్గానికి టిడిపి ఇన్ చార్జ్‌గా వ్యవహరించారు.

జీవిత విశేషాలు

అతను 1982 ఆగస్టు 10శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలానికి చెందిన రామయ్య పుట్టుగ గ్రామంలో ప్రకాష్ రావు, జ్యోతీబాల దంపతులకు జన్మించాడు[1]. ఏలూరులోని డెంటల్ కళాశాలలో బి.డి.ఎస్. చదివాడు. వైద్యవృత్తిని ప్రక్కకు పెట్టి ప్రజా సేవకు నడుంభిగించాడు.[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసిన అతను 86.815 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఎన్.రామారావుపై 25000లకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు.[3] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిరయా సాయిరాజ్ పై విజయం సాధించాడు[4].

మూలాలు

  1. "Ashok Bendalam MLA of ICHCHAPURAM Andhra Pradesh contact address & email". nocorruption.in. Retrieved 2018-06-09.
  2. "అందరి మన్ననలు అందుకుంటోన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే డా|| బెందాళం.అశోక్".
  3. "ఇచ్ఛాపురం టి.డి.పి ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?".
  4. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.

బయటి లంకెలు