మంత్రి

From tewiki
Jump to navigation Jump to search

మంత్రి (Minister) అనే పదం పూర్వకాలం నుండి వాడబడుతుంది.రాచరికాలు,రాజ్యాలు ఉండే పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రిని అమాత్యులు, రాజప్రతినిధి, దివాను అని వ్యవహరించేవారు.వీరు మహారాజుకు ముఖ్యమైన సలహాదారుడుగా ఉండేవాడు.దానికి ఉదాహరణగా మహామంత్రి తిమ్మరుసును చెప్పుకోవచ్చు. సంబోధనా పదం ' అమాత్యా ' అని సంబోదించేవారు.వివిధ రంగాలకు వివిధ మంత్రులు లేదా అమాత్యులు వుండేవారు.ప్రధానమైన మంత్రిని మహామంత్రి అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో కేంధ్రప్రభుత్వంలో ప్రధాన మంత్రి,రాష్ట్ర ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి అని వ్యవహరింపబడుతుంది.వివిధ విభాగాలకు ఉన్న మంత్రులు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి అదీనం క్రింద వారికి కేటాయించిన శాఖల పరిపాలనపై నియంత్రణాధికారం కలిగి ఉంటారు. రాష్ట్రప్రభుత్వాలకు చెందిన మంత్రులను రాష్ట్ర మంత్రులని,కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులను కేంద్ర మంత్రులు అని అంటారు.

నిర్వచనం

ఒక దేశం లేదా ప్రాంతంలో ప్రజలను పరిపాలించే మంత్రాంగంలో (ప్రభుత్వం) లో సభ్యుడుగా ఉండి ఒక నిర్దిష్ట విభాగానికి బాధ్యత వహించే వ్యక్తిని మంత్రి అని అంటారు.ఆ విభాగంపై ఇతను ముఖ్యమైన స్థానం కలిగి ఉంటాడు.[1]

వివిధ విభాగాల మంత్రులు

  • ఉపముఖ్యమంత్రి
  • హోంమంత్రి
  • ఆర్థికశాఖ మంత్రి
  • విద్యాశాఖమంత్రి
  • రవాణాశాఖ మంత్రి
  • ఆరోగ్యశాఖ మంత్రి
  • దేవాదాయశాఖ మంత్రి

ఇవి కూడా చూడండి

రకాలు

మూలాలు

  1. "MINISTER | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in English). Retrieved 2020-08-13.

వెలుపలి లంకెలు