మణుగూరు మండలం

From tewiki
Jump to navigation Jump to search
మణుగూరు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో మణుగూరు మండల స్థానం
మణుగూరు is located in తెలంగాణ
మణుగూరు
మణుగూరు
తెలంగాణ పటంలో మణుగూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం మణుగూరు
గ్రామాలు 7
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 72,117
 - పురుషులు 35,844
 - స్త్రీలు 36,273
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.36%
 - పురుషులు 75.55%
 - స్త్రీలు 58.91%
పిన్‌కోడ్ 507117

మణుగూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

లోగడ మణుగూరు పట్టణం ఖమ్మంజిల్లా, పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మణుగూరు మండలాన్ని (1+9) పది గ్రామాలతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని చూడదగిన ప్రదేశాలు

 • 13 వ శతాబ్దం నాటి శివాలయం,మణుగూరు
 • బొగ్గు గనులు
 • అన్నిటికన్నా ముఖ్యమైంది పర్ణశాల: పర్ణశాలకు మణుగూరు నుండి వెళ్ళడంలో ఒక ఆనందం ఉంది. గోదావరి మీదుగా పడవ ప్రయాణం చేయడం వీలవుతుంది. మణుగూరు గ్రామ కేంద్రం నుండి 6 కి.మీ. దూరంలో రాయగూడెం అనే ఊరుంది. అక్కడకు ఆటోలు, బస్సులు వెళతాయి. అక్కడనుండి 1 కి.మీ. లోపు వరకు పడవ ప్రయణం చేసి పర్ణశాల చేరవచ్చు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 1. మణుగూరు
 2. గుండ్లసింగారం
 3. అన్నారం
 4. అనంతారం
 5. చిన్నరావిగూడెం
 6. సమితి సింగారం
 7. మల్లారం
 8. పెద్దిపల్లి
 9. రామానుజవరం
 10. Pagideru

గమనిక:నిర్జన గ్రామాలపరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

 1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.

వెలుపలి లంకెలు