మల్లాపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search

మల్లాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మెట్‌పల్లి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53,870 - పురుషుల సంఖ్య 26,080 - స్త్రీల సంఖ్య 27,790.[2]అక్షరాస్యత (2011)- మొత్తం 39.40% - పురుషుల సంఖ్య 53.03% - స్త్రీల సంఖ్య 26.86%.

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

లోగడ మల్లాపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా,జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మల్లాపూర్ మండలాన్ని (1+20) ఇరవైఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. మల్లాపూర్
  2. ఓబులాపూర్
  3. సంగెం
  4. శ్రీరాంపూర్
  5. దామరాజపల్లి
  6. వల్గొండ
  7. వేంపల్లి వెంకటరావుపేట
  8. గొర్రెపల్లి
  9. మొగల్‌పేట్
  10. నడుకుడ
  11. సిర్పూర్
  12. ఇందిరానగర్
  13. రేగుంట
  14. గుండంపల్లి
  15. రాఘవపేట
  16. ముత్యంపేట్
  17. చిట్లాపూర్
  18. సాతారం

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు