"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మాదిగ

From tewiki
Revision as of 00:02, 20 October 2020 by imported>Pranayraj1985 (2402:8100:2216:95D7:5C38:C40D:1F19:D0DF (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
Jump to navigation Jump to search
మాదిగ
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ
భాషలు
తెలుగు, కన్నడ భాష, హిందీ భాష
సంబంధిత జాతి సమూహాలు
తెలుగు ప్రజలు, హిందీ ప్రజలు, కన్నడిగులు

మాదిగ (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) దళితులకు చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులం గా వర్గీకరింపబడినవారు. [1] షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం మాదిగ . ఈ కులస్తులు పూర్వం చచ్చిన పశువుల తోలుతీసి చెప్పులు కుట్టడం,పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) ని మంద కృష్ణ మాదిగ స్థాపించారు.

మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు లెల్లే సురేశ్ ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం మహాదిగ విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.[1]

మూలాలు

  1. 1.0 1.1 Madhav, K.V.S. (2004-09-09). "Starring Madiga and dappu..." The Hindu. p. 02. Retrieved 2016-05-24.

ఇతర పఠనాలు

బయటి లంకెలు