"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మారియో

From tewiki
Revision as of 13:48, 22 February 2021 by Rajyalakshmiindicwiki.in (talk | contribs) (వీడియో గేమ్స్ జాబితా)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

మారియో అనేది ఓ వీడియో గేమ్. జపాన్ కి చెందిన 'షిగెరు మియామోటో' దీని రూపకర్త. దాదాపు 200ల వరకు ఈ గేమ్ వివిధ సీరీస్ లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లలో బాగా అమ్ముడుపోయిన వీడియో గేమ్ గా ఇది పేరొందిది. పైగా టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో ప్రచారమైంది. 1990 నుంచి మారియోలా చార్లెస్ మార్టినెట్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. పలు కామిక్ పుస్తకాలు కూడా వచ్చాయి. షిగేరు మొదటగా మారియోని సాధారణ పాత్రగా చిత్రించిన, తరువాత జంపింగ్ సామర్ధ్యాన్ని చేర్చడంతో మారియో విశిష్టత పెరిగింది.

మారియో వీడియో గేమ్స్ జాబితా :

1. డాంకీ కాంగ్: 09, జులై, 1981లో మారియో జంప్ మాన్ గా చేసిన తొలి వీడియో గేమ్ ఈ డాంకీ కాంగ్. ఇందులో ఒక కార్పెంటర్ గా కనిపిస్తాడు. తోడుగా ఒక కోతి కూడా ఉండేది. దాని పేరు డాంకీ కాంగ్. ఇందులో మారియో తన స్నేహితురాలిని కాపాడడానికి జంప్ మాన్ గా కీలక పాత్ర పోషిస్తాడు.

2. సూపర్ మారియో ల్యాండ్ (1989- 1995)

3. సూపర్ మారియో 64(1996 - 2002)

4. న్యూ సూపర్ మారియో బ్రోస్ (2006)

ఇతర మారియో ఆటలు :

మారియో పిన్ బాల్, మారియో పజిల్ వీడియో గేమ్.

ఆర్ పిజి గేమ్స్: 1996లో రోల్ ప్లేయింగ్ గేమ్స్(ఆర్ పిజి) అనేవి మొత్తంగా 13 వచ్చాయి. అందులో పేపర్ మారియోవి 6 సిరీస్లు.

మారియో& ల్యూగి కలిపి 7 సిరీస్లు.

స్పోర్ట్స్ గేమ్స్: అన్ని సిరీస్ లలాగే స్పోర్ట్స్ విభాగంలో మారియో కార్ట్ అనేది రానురాను సూపర్ మారియో కార్ట్ అయింది. కార్ట్ రేసింగ్ అనే ఆటతో స్పోర్ట్స్ గేమ్స్ లోనే విజయవంతమైన ఆటగా నిలిచింది మారియో.

విశేషాలు :
  • ఇవే కాక ఇతర వీడియో గేమ్స్ లోనూ అతిథి పాత్రలోనూ కనిపించాడు.
  • వీడియో గేమ్స్ లోనే కాక 1983లో రూబీ స్పేర్స్ ప్రొడక్షన్ లో 'సాటర్ డే సూపర్ కేడ్' అనే చిత్రం కూడా వచ్చింది. ఇది ఆనిమేటెడ్ విధానంలో టీవిలో ప్రసారమైంది.
  • అలాగే లైవ్ యాక్షన్ చిత్రంగా సూపర్ మారియో బ్రోస్ అనేది విడుదలయింది.
మూలాలు