ముకుందవిలాసము

From tewiki
Revision as of 06:55, 7 May 2017 by imported>Nrgullapalli
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ముకుందవిలాసం
కృతికర్త: కాణాదం పెద్దన
అంకితం: గద్వాల లోని చెన్నకేశవస్వామికి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కావ్యం
విభాగం (కళా ప్రక్రియ): ప్రబంధం
ప్రచురణ: సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాల, గద్వాల1886, తెలుగు విజ్ఞానపీఠం 1985.
విడుదల:


ముకుందవిలాసము ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు ప్రబంధం. దీనిని గద్వాల సంస్థానపు ప్రభువుల ఆస్థాన కవి కాణాదం పెద్దన సోమయాజి రచించారు. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి క్రీ.శ. 1886లో గద్వాల సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది[1].. తరువాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని 1985లో ముద్రించారు. ముకుందుడు అనగా శ్రీకృష్ణుడు. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి జరిగిన వివాహం ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువలన దీనికి భద్రాపరిణయం, భద్రాపరిణయోల్లాసం అని దీనికి నామాంతరాలు ఉన్నాయి. ఇది గద్వాల సంస్థాన ప్రభువు చినసోమ భూపాలుని ఆస్థానంలో చేరిన తరువాత అతని ప్రేరణచే పెద్దన రచించిన మొదటి ప్రబంధం. ఈ ప్రబంధం గద్వాల లోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి.

ప్రథమాశ్వాసము

శ్రీకృష్ణుడు ద్వారలలో వుంటూ ప్రజలను ఈతిబాధలు లేకుండా పాలిస్తున్నాడు. ఒకనాడు పాండవులను చూడాల్ని ఇంద్రప్రస్థానికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తుంటాడు. ఒకనాడు కృష్ణార్జునులు ముచ్చటలాడుచుండగా వారి వద్దకు అగ్నిదేవుడు వచ్చి ఆకలిగావున్నది కావున ఖాండవవనాన్ని ఆహుతిగా ఇమ్మని వేడుకుంటాడు. కృష్ణార్జునులు అందులకు అంగీకరిస్తారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తుండగా ఆ వనంలోనున్న మయుడు అగ్నిదాహాన్ని భరించలేక అర్జునున్ని శరణు వేడుకుంటాడు. అర్జునుడు మయుణ్ణి రక్షిస్తాడు. మయుడు కృతజ్ఞడై అర్జునునికి మయసభను సమర్పిస్తాడు. శ్రీకృష్ణుదు తిరిగి ద్వారకకు తిరిగివస్తాడు.

అర్జునుడు తనను రక్షించింది శ్రీకృష్ణుని మూలంగానే కదా అని మయుడు ఒక చిత్రసభను నిర్మించి దానిని శ్రీకృష్ణునికి సమర్పించాలని ద్వారకకు వెళ్తాడు. శ్రీకృష్ణుని మాయా ప్రభావం వల్ల ఆ సభాభవనమంతా అతనికి పలువింతలతో కనిపిస్తుంది. తనెంత భ్రమలో వున్నది గ్రహించి రైవతక పర్వత సానుతలం మీద ఒక కేళీవనాన్ని నిర్మించి శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. అదే విధంగా కానుకలను సమర్పించడానికి ఇంద్రుడు కూడా ద్వారకకు వచ్చి పశ్చాత్తాపంతో అక్కడొక లతాసంచయాన్ని నాటి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు ఆ కేళీవనంలో విహరిస్తూ సుఖంగా ఉంటాడు.

ఒకనాడు వసుదేవుని వెల్లెలైన శ్రుతకీర్తి యోగక్షేమాలను తెలుసుకొని రావడానికి తన కుమారుడైన గదుణ్ణి పంపుతాడు. గదుడు కేకయపురానికి వెళ్ళి మేనత్త యోగక్షేమాలను తెలుసుకొని వచ్చి తన తండ్రికి తెలియజేస్తాడు. ఏకాంతంగా శ్రీకృష్ణునితో మేనత్త కూతురైన భద్రాదేవి సౌందర్యాతిశయాన్ని గూర్చి చెబుతాడు. శ్రీకృష్ణునికి భద్రపై ప్రేమ అంకురిస్తుంది. వసంతంలో ఒకనాడు శ్రీకృష్ణుడు రైవతక పర్వతానికి వెళ్ళి తదారామశోభను తిలకిస్తూ ఆనందనిమగ్నుడౌతాడు.

ఇవీ చూడండి

మూలాలు

  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-134